English | Telugu

స్పిరిట్ లో చిరంజీవి.. క్లారిటీ ఇచ్చిన సందీప్ రెడ్డి!

మెగాస్టార్ చిరంజీవికి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా అభిమాని అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సందీప్ రెడ్డి చేయనున్న 'స్పిరిట్'(Spirit)లో చిరంజీవి నటించనున్నారని వార్తలొచ్చాయి. తాజాగా ఈ న్యూస్ పై సందీప్ క్లారిటీ ఇచ్చారు.

అసలే ప్రభాస్, సందీప్ రెడ్డి కాంబినేషన్ కావడంతో 'స్పిరిట్'పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. దానికి తోడు చిరంజీవి నటిస్తున్నారన్న వార్త అందరి దృష్టిని ఆకర్షించింది. సందీప్ డైరెక్షన్ లో చిరంజీవి, ప్రభాస్ కాంబినేషన్ అంటే చూడటానికి రెండు కళ్ళు సరిపోవంటూ అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు.

అయితే అభిమానులు అలాంటి ఆశలు పెట్టుకోవద్దంటూ తాజాగా సందీప్ రెడ్డి షాకిచ్చారు. స్పిరిట్ లో చిరంజీవి గారు నటించట్లేదని, అది రూమర్ మాత్రమేనని సందీప్ క్లారిటీ ఇచ్చారు.

స్పిరిట్ లో చిరంజీవి భాగం కానప్పటికీ, ఆయనతో ఒక సోలో ఫిల్మ్ చేయాలని ఉందని సందీప్ రెడ్డి తన మనసులోని మాట బయటపెట్టారు.

Also Read: శివ నటికి 36 ఏళ్ళ తర్వాత వర్మ క్షమాపణలు!

సందీప్ మామూలుగానే తన రైటింగ్, టేకింగ్ తో అందరినీ సర్ ప్రైజ్ చేస్తుంటారు. అలాంటిది తన అభిమాన హీరో చిరంజీవితో సినిమా అంటే.. అది ఏ రేంజ్ లో రాస్తాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు.

చూద్దాం మరి త్వరలోనే చిరంజీవి, సందీప్ రెడ్డి కాంబో సినిమాకి ముడిపడుతుందేమో.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.