English | Telugu

శివ నటికి 36 ఏళ్ళ తర్వాత వర్మ క్షమాపణలు!

1989లో నాగార్జున, రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్ లో వచ్చిన కల్ట్ క్లాసిక్ ఫిల్మ్ 'శివ' ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఈ నవంబర్ 14న శివ రీ-రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా ఏకంగా 36 ఏళ్ళ తర్వాత దర్శకుడు ఆర్జీవీ ఓ నటికి క్షమాపణలు చెప్పడం ఆసక్తికరంగా మారింది.

శివ సినిమాలో హీరో అన్నయ్య కూతురి పాత్రలో సుష్మ నటించింది. ముఖ్యంగా నాగార్జునతో కలిసి ఆమె నటించిన రిస్కీ సైకిల్ ఛేజ్ సీన్ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలిచింది. 36 ఏళ్ళ తర్వాత ఇప్పుడు ఆ బాల నటి ఎలా ఉంది? ఆమె ఏం చేస్తుంది? తెలుపుతూ తాజాగా రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Also Read:అఖండ-2.. పక్కా ప్లానింగ్ తో పాన్ ఇండియా తాండవం!

"శివలోని ఐకానిక్ సైకిల్ ఛేజ్ సీన్ లో నటించిన సుష్మ ఇప్పుడు ఇలా ఉంది. అప్పుడు భయంగా సైకిల్ మీద కూర్చొని ఉన్న అమ్మాయి.. ఇపుడు యూఎస్ లో AI మరియు కాగ్నిటివ్ సైన్స్‌లో రీసెర్చ్ చేస్తోంది." అని ట్వీట్ చేయడమే కాకుండా, సుష్మ ప్రజెంట్ ఫొటోని పంచుకున్నారు వర్మ.

ఆర్జీవీ ట్వీట్ కి సుష్మ రిప్లై ఇవ్వడం విశేషం. "థాంక్యూ సార్. శివ లాంటి ఐకానిక్ ఫిల్మ్ లో భాగమవ్వడం సంతోషంగా ఉంది. బాలనటిగా ఆ అనుభూతిని ఎప్పటికీ మరిచిపోలేను. శివ 4K కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నాను." అని సుష్మ రాసుకొచ్చారు.

దానికి వర్మ మరో ఆసక్తికర రిప్లై ఇచ్చారు. "ఒక చిన్న పాపగా ఆ రిస్కీ షాట్స్ లో నువ్వు ఎంత భయపడ్డావో.. అప్పుడు నాకు తెలియదు. 36 ఏళ్ళ తర్వాత ఇప్పుడు మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నాను." అన్నారు.

ప్రస్తుతం సుష్మ ఫొటో, ఆర్జీవీ చేసిన ట్వీట్ వైరల్ గా మారాయి.

రికార్డుల వేటలో మన శంకర వరప్రసాద్ గారు.. రెండు రోజుల కలెక్షన్స్ ఇవే 

సిల్వర్ స్క్రీన్ పై మనశంకరవరప్రసాద్ గారు(Mana Shankara Varaprasad Garu)వెంకీ గౌడ ల జులుం యధావిధిగా కొనసాగుతుంది. ఎనామనస్ గా అన్ని ఏరియాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తుండటంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కలకలలాడుతున్నాయి. దీంతో హిట్ కోసం ఎదురుచూస్తున్న చిరంజీవికి ఏకంగా బ్లాక్ బస్టర్ హిట్ దక్కినట్లయింది. కలెక్షన్స్ పరంగా కూడా చిరంజీవి కెరీర్ లోనే హయ్యస్ట్ నెంబర్ ని వసూలు చేసే అవకాశం ఉందని సినీ ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. మరి ఇప్పటి వరకు  మన శంకర వర ప్రసాద్ రాబట్టిన కలెక్షన్స్ ని చూద్దాం.