English | Telugu

ఫ్రెండ్‌షిప్ కోసం అవన్నీ చేశా - కరీనా


బాలీవుడ్ పాపులర్ నటి కరీనా ఫ్రెండ్‌షిప్ కోసం చాలా చిత్రాలు చేశాను. ఇకపై మంచి కథ వుంటేనే చేస్తాను అని అంటోంది. పెళ్లైన తర్వాత కూడా నెంబర్ వన్ రేస్‌లో కొనసాగుతున్న కరీనా కమర్షియల్ హిట్స్ ఎన్నో సొంతం చేసుకుంది. కభీ ఖుషీ కభీ గమ్, 3 ఇడియట్స్, బాడీగార్డ్ లాంటి కమర్షియల్ చిత్రాలతో పాటు ఓంకార, చమేలీ, రెఫ్యూజీ లాంటి ఆఫ్‌బీట్ చిత్రాలలోను నటించి మెప్పించింది కరీనా. అందం, టాలెంట్‌తో పాటు కావలిసినంత పాపులారిటీ వున్న ఈ బాలీవుడ్ బ్యూటీ ఇకపై మంచి స్టోరీ చిత్రాలకు మాత్రమే ప్రాధన్యతనిస్తానంటోంది. గతంలో ఫ్రెండ్‌షిప్ కోసం కొన్ని చిత్రాలు చేశానని, అవి చేసినందుకు తానేం బాధపడటంలేదని చెప్పుకొచ్చింది. అయితే కమర్షియల్ చిత్రాలతో పాటు, నటనకు ప్రాధన్యత వున్న పాత్రలు చేస్తూ తన కెరీర్‌ను బ్యాలెన్స్ చేసుకున్నాని కరీనా తెలిపింది. కరీనా ఇలా స్టోరీకి ప్రాముఖ్యతనిస్తానటంతో కమర్షియల్ సినిమాలకు ఆమె ఎక్కడ దూరం అవుతుందేమోనని అభిమానులు కంగారు పడుతున్నారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.