English | Telugu
డీజే టిల్లు సిద్ధుకి అవకాశాలు ఎలా వస్తున్నాయో ఆ హీరో చెప్పిన విషయంతో అర్ధమైంది
Updated : Dec 6, 2023
జొన్నలగడ్డ సిద్దు ప్రస్తుతం తెలుసు కదా అనే మూవీని చేస్తున్నాడు. ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ మూవీ డైరెక్టర్ గా నీరజకి ఫస్ట్ మూవీ. సిద్దు సరసన రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి లు హీరోయిన్లుగా చేస్తున్న ఈ సినిమాని ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. తాజాగా ఈ మూవీ సిద్దు కి ఎలా వచ్చిందనే విషయం మీద సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి.
సిద్దు కెరీర్లోనే అత్యంత భారీ బడ్జట్ తో రూపొందుతున్న ఈ చిత్రం యొక్క షూటింగ్ రెగ్యులర్ గా జరుపుకుంటుంది. నీరజ కోన ఈ సినిమాకి హీరోగా సిద్దు నే ఎంచుకోవడానికి ప్రధాన కారణం ప్రముఖ హీరో నితిన్. అవును నితినే మీ సినిమా కథ కి సిద్దు బాగుంటాడని నీరజ కి చెప్పడంతో సిద్దు ఈ సినిమాకి హీరో అయ్యాడు. ఒకసారి నితిన్ మారెడుమిల్లిలో తన సినిమా షూటింగ్ లో ఉన్నప్పుడు నీరజ కూడా నితిన్ వెంటే ఉంది. షూటింగ్‌కు గ్యాప్ లో ఇద్దరు రిలాక్స్ అవుతున్న టైంలో సిద్దు నటించిన డీజే టిల్లు సినిమా టీవీలో వస్తు ఉంది. సినిమా మొత్తం చూసిన నితిన్ నీరజతో నువ్వు తెరకెక్కించబోయే సినిమా కథ సిద్దు కి సూట్ అవుతుందని చెప్పాడు. అలాగే అంతటితో ఆగకుండా సిద్దుకి ఫోన్ చేసి నీరజ దగ్గర కథ ఉంది నీకు చాలా బాగుంటుందని నితిన్ చెప్పాడు.ఆ విధంగా సిద్దు కొత్త చిత్రం తెలుసు కదా ప్రారంభం అయింది.
ఈ విషయాలన్నీ నితిన్ కొత్త చిత్రం ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బయటకి వచ్చాయి.ఆ మూవీ ప్రమోషన్స్ లో సిద్దు తో కలిసి నితిన్ తన కొత్త సినిమా అనుభవాలని పంచుకున్నాడు. అలాగే సినిమా కూడా చాలా అధ్బుతంగా వచ్చిందని అందరం కూడా చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్నామని కూడా నితిన్ చెప్పుకొచ్చాడు. వీరిద్దరి మధ్యన జరిగిన ఫన్నీ ఎపిసోడ్ ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తుంది.