English | Telugu
"సంగీత్" మూవీలో హీరోగా హాయ్ నాన్న డైరెక్టర్ శౌర్యవ్ సోదరుడు నిఖిల్..
Updated : May 15, 2024
నిఖిల్ తో నాటకాలు పేరుతో యూట్యూబ్ లో సెలబ్రిటీస్ ని ఇంటర్వ్యూస్ చేసే నిఖిల్ విజయేంద్ర సింహ మూవీలో హీరోగా నటించబోతున్నాడు. సోషల్ మీడియా ద్వారా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న నిఖిల్ హాయ్ నాన్న డైరెక్టర్ శౌర్యవ్ సోదరుడు.. ఇప్పుడు అతన్ని "సంగీత్” మూవీ ద్వారా లహరి ఫిల్మ్స్ పరిచయం చేస్తోంది. నిఖిల్ కి జోడిగా తేజు అశ్విని కనిపించనుంది. సమర్థ్ పాత్రలో నిఖిల్ కనిపించబోతున్నాడు. "ఎట్టకేలకు మ్యాజిక్ జరిగిపోయింది. మిమ్మల్నందరినీ సంగీత్ ప్రపంచానికి ఆహ్వానిస్తున్నాం. నేను ఎంతో పుణ్యం చేసుకున్నా.
నటుడిగా నా ప్రయాణం మొదలు కాబోతోంది. నేను వేసిన ప్రతీ అడుగును మీరంతా ప్రేమతో సపోర్ట్ చేశారు. మీ లవ్, సపోర్ట్, సాక్రిఫైస్ నన్నింత దూరం తీసుకొచ్చింది. మీ అందరి వల్లనే ఇదంతా జరిగింది...మీరు లేకుండా నేను లేను. కృతజ్ఞతతో , ఎన్నో కలలతో కొత్త అధ్యాయంలోకి అడుగుపెడుతున్నాను...ప్రేమతో మీ నిఖిల్ విజయేంద్ర సింహ" అని ఒక పోస్ట్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసాడు. "సంగీత్" మూవీ ప్రొడ్యూసర్స్ పూజ చేసి తమ ప్రాజెక్ట్‌ను స్టార్ట్ చేశారు . సంగీత్‌లో నిఖిల్ విజయేంద్ర సింహ కథానాయకుడిగా నటించారు. నిహారిక కొణిదెల స్క్రిప్ట్ అందించగా, హాయ్ నాన్న డైరెక్టర్ శౌర్యవ్ కెమెరా స్విచాన్ చేశారు. ముహూర్తపు షాట్ కోసం ఎస్.ఎస్. కార్తికేయ క్లాప్ కొట్టారు. కన్నడలో 'హంబుల్ పొలిటీషియన్ నోగ్రాజ్'తో గుర్తింపు తెచ్చుకున్న రైటర్ ,డైరెక్టర్ సాద్ ఖాన్ "సంగీత్” ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. లహరి ఫిలిమ్స్, ఆర్.బి. స్టూడియోస్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు.