English | Telugu

నిఖిల్ హీరోగా భారీ హిస్టారికల్ ఫిల్మ్!

సినిమా సినిమాకి వైవిధ్యం చూపిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నిఖిల్ సిద్ధార్థ్. ఆయన హీరోగా నటించిన సినిమా వస్తుందంటే, అందులో మంచి కంటెంట్ ఉంటుందనే అభిప్రాయం ప్రేక్షకుల్లో ఉంది. గతేడాది 'కార్తికేయ-2'తో పాన్ ఇండియా రేంజ్ లో బ్లాక్ బస్టర్ అందుకున్న నిఖిల్.. ఈ ఏడాది ఇప్పటికే '18 పేజెస్'తో ఆకట్టుకున్నాడు. త్వరలో 'స్పై' అనే మరో పాన్ ఇండియా ఫిల్మ్ తో అలరించడానికి సిద్ధమవుతున్నాడు. అలాగే దాని తర్వాత ఓ భారీ హిస్టారికల్ ఫిల్మ్ లో నటించనున్నాడు.

నిఖిల్ హీరోగా గ్యారీ బీహెచ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా 'స్పై'. ఈడీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమా జూన్ 29న పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా విడుదల కానుంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ మూవీ టీజర్ ను నిన్న(మే 15) విడుదల చేశారు. టీజర్ కి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. టీజర్ తో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. టీజర్ కి వస్తున్న రెస్పాన్స్ నేపథ్యంలో తాజాగా మూవీ టీమ్ ప్రెస్ నిర్వహించింది. ఈ సందర్భంగా నిఖిల్ మాట్లాడుతూ 'స్పై' మూవీ ఖచ్చితంగా అందరినీ ఆకట్టుకుంటుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. అలాగే తన తదుపరి సినిమాకి సంబంధించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు.

తాను తదుపరి చేయబోయేది వెయ్యేళ్ళ క్రితం నాటి కథతో హిస్టారికల్ ఫిల్మ్ అని నిఖిల్ చెప్పాడు. ఇది 'కార్తికేయ-2' తరహాలో అన్వేషించే ఫిల్మ్ కాదు, అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఫిల్మ్ అని అన్నాడు. ఇది పీరియాడిక్ ఫిల్మ్ అని, త్వరలో అనౌన్స్ చేస్తామని తెలిపాడు. మొత్తానికి నిఖిల్ 'కార్తికేయ-2'ని మించి 'స్పై', 'స్పై'ని మించి మరో సినిమా ప్లాన్ చేశాడని అర్థమవుతోంది.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...