English | Telugu
ప్రజాస్వామ్యం బతికే ఉందంటు తెలివిగా గెలిచిన ఇద్దరికీ కంగ్రాట్స్ చెప్పిన టాప్ హీరో
Updated : Dec 4, 2023
హీరో నిఖిల్ సినీ కెరియర్ ప్రస్తుతం ఉచ్చ స్థితిలో కొనసాగుతు ఉంది. కార్తికేయ 2 తో పాన్ ఇండియా హీరోగా ఎదిగిన నిఖిల్ ప్రస్తుతం స్వయంభూ అనే ఒక పీరియాడిక్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాలోని తన క్యారక్టర్ కి సంబంధించి కత్తి విన్యాసాలని కూడా నేర్చుకుంటున్నాడు.ఈ సినిమానే కాకుండా మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్ లు నిఖిల్ చేతిలో ఉన్నాయి. తాజాగా నిఖిల్ తన ట్విట్టర్ లో చేసిన పోస్ట్ ఒకటి సంచలనం సృష్టిస్తుంది.
నిన్న తెలంగాణ వ్యాప్తంగా జరిగిన ఎన్నికల ఫలితాలు విడుదల అయ్యాయి.రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధ్బుతమైన మెజారిటీ ని సాధించి తెలంగాణలో అధికారాన్ని సంపాదించింది. ఇప్పుడు ఈ విషయంలో రేవంత్ రెడ్డి కి కంగ్రాట్స్ చెప్తు నిఖిల్ తన ట్విట్టర్ లో ఒక ట్వీట్ చేసాడు. తెలంగాణ రాష్ట్రంలో అఖండ విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డి అన్నకు కంగ్రాట్స్ అంటు నిఖిల్ చేసిన ఆ ట్వీట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.
అలాగే తెలంగాణతో పాటు ఛత్తీస్ ఘడ్, రాజస్థాన్ ,మధ్యప్రదేశ్ లో జరిగిన ఎన్నికల ఫలితాలు కూడా విడుదల అయ్యాయి. తెలంగాణ ని మినహాయించి మిగతా మూడు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ విజయ దుందుభి మోగించింది. మూడు రాష్ట్రాల్లో విజయం సాధించిన బీజేపీకి అభినందనలు. ప్రజాస్వామ్యం సజీవంగా ఉంది. జై హింద్.’ అంటూ నిఖిల్ తన ఎక్స్ లో రాసుకొచ్చాడు. నిఖిల్ చాలా తెలివిగా తన మీద ఒక పార్టీ ముద్ర పడకుండా కాంగ్రెస్, బీజేపీ ఇద్దరికి శుభాకాంక్షలు చెప్పడంతో నిఖిల్ తెలివితేటల్ని అందరు మెచ్చుకుంటున్నారు.