English | Telugu

ఒకే కథతో నిఖిల్ 'స్పై', కళ్యాణ్ రామ్ 'డెవిల్'!

నిఖిల్ హీరోగా నటిస్తున్న తాజా పాన్ ఇండియా ఫిల్మ్ 'స్పై'. ఈడీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి గ్యారీ బీహెచ్ దర్శకుడు. జూన్ 29న ఈ సినిమా విడుదల కానుంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ మూవీ టీజర్ తాజాగా విడుదలై ఆకట్టుకుంటోంది. అయితే ఈ సినిమా కథ, కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న 'డెవిల్' కథ ఒకటేననే ఆసక్తికర చర్చ జరుగుతోంది.

కళ్యాణ్ రామ్ హీరోగా నవీన్ మేడారం దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'డెవిల్'. ఇందులో బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ గా కళ్యాణ్ రామ్ కనిపించనున్నాడు. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ నేపథ్యంలోనే తెరకెక్కుతోందని తెలుస్తోంది. దీంతో 'స్పై', 'డెవిల్' సినిమాల కథ ఒకటేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే తాజాగా ఈ విషయంపై నిఖిల్ క్లారిటీ ఇచ్చాడు.

'స్పై' టీజర్ కి సూపర్ రెస్పాన్స్ వస్తున్న నేపథ్యంలో తాజాగా మూవీ టీమ్ ప్రెస్ మీట్ నిర్వహించి, తమ సంతోషాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా నిఖిల్ కి మీడియా నుంచి ఓ ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. "సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ పాయింట్ మీదే 'డెవిల్' సినిమా తీస్తున్నారు. ఆ విషయం తెలుసా మీకు?" అని మీడియా నుంచి ఎదురైన ప్రశ్నకు నిఖిల్ సమాధానమిచ్చాడు. "అది డిఫరెంట్ స్టోరీ. 1900లలో జరిగిన కథ. మాది మోడ్రన్ లో జరిగిన కథ. రెండు సినిమాల టీమ్స్ ఇప్పటికే కథ గురించి మాట్లాడుకున్నారు. రెండూ డిఫరెంట్ గా ఉంటాయి. మీరు రెండు సినిమాలను ఎంజాయ్ చేస్తారు.. అది మాత్రం గ్యారెంటీగా చెప్పగలను" అని నిఖిల్ అన్నాడు.

నిఖిల్ మాటలను బట్టి చూస్తే రెండు సినిమాల పాయింట్ ఒకటే గానీ, సెటప్ వేరుగా ఉంటుందని అర్థమవుతోంది. 1945 లో జరిగిన విమాన ప్రమాదంలో సుభాష్ చంద్రబోస్ మరిణించారని ప్రకటించినప్పటికి, ఆయన ప్రమాదం నుంచి బయటపడి అజ్ఞాతంలోకి వెళ్ళారని పలువురు నమ్ముతారు. ఇదే పాయింట్ తో ఈ రెండు సినిమాలు వస్తున్నాయి అనిపిస్తోంది. అయితే 'డెవిల్' కథ 1945 లో నేతాజీ మిస్ అయిన సమయంలో జరిగినట్టు చూపించే అవకాశముండగా.. 'స్పై'లో మాత్రం ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు కొందరు స్పైలు ఆ డెత్ మిస్టరీని ఛేదించే ప్రయత్నం చేసినట్లు చూపించబోతున్నారు అనిపిస్తోంది. ఒకే తరహా పాయింట్ తో రెండు విభిన్న కోణాల్లో వస్తున్న ఈ సినిమాలను ప్రేక్షకులు ఏ స్థాయిలో ఆదరిస్తారో చూడాలి.

Dominic And The Ladies Purse Review: డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్ మూవీ రివ్యూ

సి.ఐ డొమినిక్ (మమ్ముట్టి) ప్రైవేట్ డిటెక్టివ్ గా చేస్తుంటాడు. అతడు గతంలో పోలీస్ ఆఫీసర్. ఇక అతనికి సహాయంగా ఉండేందుకు ఒక వ్యక్తి కావాలంటూ డొమినిక్ పేపర్ లో ప్రకటన ఇస్తాడు. దాంతో విక్కీ (గోకుల్ సురేశ్) అతడికి అసిస్టెంట్ గా  జాయిన్ అవుతాడు. ఒకరోజు డొమినిక్ ఉండే ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్) అతని దగ్గరికి వచ్చి.. తను జనరల్ హాస్పిటల్ కి వెళ్లినప్పుడు ఒక 'పర్స్' దొరికిందని చెప్పి ఇస్తుంది. ఆ పర్స్ ఎవరిదో తెలుసుకుని వాళ్లకి అందజేయమని చెప్తుంది. దాంతో ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతికి చెందినదని తెలుసుకుంటాడు. అయితే ఆ పర్స్ పారేసుకున్న రోజు నుంచి ఆమె మిస్సింగ్ అని తెలిసి షాక్ అవుతాడు...

హిందువులపై కాజల్ కీలక వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్ 

అగ్ర హీరోయిన్ గా తెలుగు చిత్ర సీమని ఏలిన నటి కాజల్(Kajal). ఏలడమే కాదు దాదాపుగా అందరి అగ్ర హీరోలతో జతకట్టి తెలుగు చిత్రసీమలో తనకంటు ఒక అధ్యాయాన్ని సృష్టించుకుంది. పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ నటిగా కూడా ఎన్నో చిత్రాల ద్వారా నిరూపించుకున్న కాజల్ పెళ్లి తర్వాత నటనకి దూరమవుతుందని అందరు అనుకున్నారు. కానీ ఆమె తన నట ప్రస్థానాన్ని కొనసాగిస్తు ఈ సంవత్సరం జూన్ 7 న 'సత్యభామ' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీతో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ దేశంలో కొంత మంది అరాచక శక్తులు హిందువులు లక్ష్యంగా దాడులు చేస్తున్న విషయం తెలిసిందే.