English | Telugu

అప్పుడే ఓటీటీలోకి 'విరూపాక్ష'!

సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా నటించిన చిత్రం 'విరూపాక్ష'. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి కార్తీక్ దండు దర్శకుడు. ఏప్రిల్ 21న విడుదలైన ఈ సినిమా సాయి ధరమ్ తేజ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. 25 రోజుల్లో వరల్డ్ వైడ్ గా రూ.47 కోట్ల షేర్ రాబట్టిన ఈ చిత్రం ఇప్పటికీ విజయవంతంగా ప్రదర్శితమవుతూ పలు చోట్ల మంచి వసూళ్లు రాబడుతోంది. అయితే అనూహ్యంగా ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో విడుదలకు సిద్ధమవ్వడం ఆసక్తికరంగా మారింది.

'విరూపాక్ష' డిజిటల్ రైట్స్ ని ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. ఈ నెల 21 నుంచి ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో విడుదలైన నెల రోజులకే ఈ బ్లాక్ బస్టర్ ఫిల్మ్.. ఓటీటీలోకి వస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఫుల్ రన్ లో ఈ సినిమా రూ.50 కోట్ల షేర్ మార్క్ అందుకుంటుందనే అంచనాలు ఉన్నాయి. 50 కోట్ల మార్క్ కి దగ్గరవుతున్న వేళ.. ఓటీటీలో అలరించడానికి సిద్ధమవ్వడం విశేషం. మరి ఈ సినిమాకి ఓటీటీలో కూడా అదే స్థాయి రెస్పాన్స్ వస్తుందేమో చూడాలి.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.