English | Telugu

హెవీ యాక్షన్‌ సీన్స్‌ యాడ్‌ చేసిన ప్రశాంత్‌ నీల్‌.. ఇక ఫ్యాన్స్‌కి పండగే!

బాహుబలి సిరీస్‌తో హీరోగా ప్రభాస్‌, కెజిఎఫ్‌ సిరీస్‌తో డైరెక్టర్‌గా ప్రశాంత్‌ నీల్‌.. వీరిద్దరూ దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్‌ తెచ్చుకున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా అంటే అది ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహించుకోవచ్చు. అందరి ఎక్స్‌పెక్టేషన్స్‌ని రీచ్‌ అయ్యేలా ప్రభాస్‌ని ‘సలార్‌’లో ప్రజెంట్‌ చేస్తున్నట్టు ఇప్పటివరకు విడుదలైన పోస్టర్స్‌, టీజర్‌, ట్రైలర్‌లలో స్పష్టమైంది. సినిమా రిలీజ్‌ కోసం మూవీ లవర్స్‌, ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఎంతో క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు. డిసెంబర్‌ 22న రిలీజ్‌ అవుతున్న ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి సందడి చేయడం లేదు మేకర్స్‌. ట్రైలర్‌ తర్వాత ఇటీవల ఈ సినిమాకి సంబంధించి ఒక పాటను మాత్రం రిలీజ్‌ చేశారు. త్వరలోనే రెండో ట్రైలర్‌ కూడా విడుదలవుతుందని తెలుస్తోంది. అయితే ప్రమోషన్స్‌ మాత్రం సినిమా రేంజ్‌కి తగ్గట్టు జరగడం లేదు. సినిమాపై వున్న బజ్‌ కారణంగా వాటన్నింటినీ పక్కన పెట్టినట్టు అనిపిస్తోంది.

ఎలాంటి ఇంటర్వ్యూలు, ప్రెస్‌మీట్‌లు లేకుండానే సినిమాకి వచ్చిన హైప్‌ని దృష్టిలో పెట్టుకొని ఆ హైప్‌ని మరింత పెంచేందుకు ప్రశాంత్‌ నీల్‌ ప్రయత్నిస్తున్నాడు. తాజా సమాచారం మేరకు ‘సలార్‌’ ఫైనల్‌ కాపీని రీ సెన్సార్‌ చేయించారు. ఈ ఫైనల్‌ వెర్షన్‌లో కొన్ని యాక్షన్‌ సీన్స్‌ను యాడ్‌ చేశారని తెలుస్తోంది. ఈ సీన్స్‌ అన్నీ రక్తపాతంతో కూడుకున్నవని సమాచారం. ఇది ప్రభాస్‌ ఫ్యాన్స్‌కి ఎంతో సంతోషాన్ని కలిగించే విషయమని మేకర్స్‌ భావిస్తున్నారట. సాధారణ ఫైట్స్‌లో ప్రభాస్‌ ఇరగదీస్తాడు. మరి ఇలాంటి హై ఓల్టేజ్‌ యాక్షన్స్‌ సీక్వెన్స్‌లు మరికొన్ని యాడ్‌ చేయడంతో సినిమా రేంజ్‌ మరింత పెరిగిందని, ప్రభాస్‌ ఇమేజ్‌ని ఎక్కడికో తీసుకెళ్ళే సినిమా ‘సలార్‌’ అవుతుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

సినిమాకి ఉన్న శక్తిని మరోసారి చాటి చెప్పావు.. వాళ్ళు భయపడుతున్నారంట! 

కళ.. పేరుగా చూసుకుంటే నామ్ చోటా.. కానీ పంచ భూతాలకి ఎంత శక్తీ ఉందో 'కళ' కి అంతే శక్తీ ఉంది. ఈ కళ నుంచి సినిమా(cinema)రూపంలో వచ్చే మాట, పాట, నటన, నటుడు, దృశ్యం అనేవి మనిషి నరనరనరాల్లో చాలా భద్రంగా ఉండిపోతాయి. ఆ ఐదింటి ద్వారా తమకి బాగా దగ్గరయ్యే  నటుడ్ని అయితే సూపర్ హీరోగా  చేసి తమ గుండెల్లో దైవశక్తిగా భద్రంగా కొలుచుకుంటూ ఉంటారు. ఇళయ దళపతి విజయ్ అప్ కమింగ్ మూవీ జననాయగన్(Jana Nayagan)రేపు ప్రీమియర్స్ నుంచే అడుగుపెడుతుండటంతో సినిమా గొప్ప తనం గురించి మరో సారి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుంది. మరి ఆ చర్చల వెనక ఉన్న పూర్తి విషయం ఏంటో చూద్దాం.