English | Telugu

రానా, ఇలియానాల "నేను-నా రాక్షసి"ఉగాదికి

రానా హీరోగా, ఇలియానా హీరోయిన్ గా నటిస్తున్న "నేను-నా రాక్షసి" సినిమా ఉగాది పర్వదినం సందర్భంగా విడుదల కానుంది. ఈ చిత్రానికి డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. రానా హీరోగా నటిస్తున్న "నేను-నా రాక్షసి" చిత్రంలో రానా ఒక ప్రొఫెషనల్ కిల్లర్ గా నటిస్తున్నాడు.ఈ చిత్రాన్ని సురేష్ బాబు నిర్మిస్తున్నారు. రానా గతంలో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో "లీడర్" చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు హీరోగా పరిచయమయ్యారు. హీరో రానాకి ఇది రెండవ సినిమా.

అలాగే పూరీ జగన్నాథ్ కి హిట్టొచ్చి చాలా కాలమయ్యింది. "నేను-నా రాక్షసి" చిత్రం హిట్టవటం హీరో రానాకి, హీరోయిన్ ఇలియానాకి, దర్శకుడు పూరీ జగన్నాథ్ కీ చాలా కీలకంగా మారింది. "నేను-నా రాక్షసి" సినిమా పేరుతో సహా ఈ చిత్రంలో చాలా ఆసక్తికరమైన అంశాలున్నాయి. హీరో రానా ఎత్తుకి ఇలియానా హీరోయిన్ గా సరిగ్గా సరిపోతుంది. రానా, ఇలియానా జంట స్క్రీన్ మీద కన్నుల పండుగ్గా కనిపిస్తుందని నిర్మాత అంటున్నారు.

సినిమాకి ఉన్న శక్తిని మరోసారి చాటి చెప్పావు.. వాళ్ళు భయపడుతున్నారంట! 

కళ.. పేరుగా చూసుకుంటే నామ్ చోటా.. కానీ పంచ భూతాలకి ఎంత శక్తీ ఉందో 'కళ' కి అంతే శక్తీ ఉంది. ఈ కళ నుంచి సినిమా(cinema)రూపంలో వచ్చే మాట, పాట, నటన, నటుడు, దృశ్యం అనేవి మనిషి నరనరనరాల్లో చాలా భద్రంగా ఉండిపోతాయి. ఆ ఐదింటి ద్వారా తమకి బాగా దగ్గరయ్యే  నటుడ్ని అయితే సూపర్ హీరోగా  చేసి తమ గుండెల్లో దైవశక్తిగా భద్రంగా కొలుచుకుంటూ ఉంటారు. ఇళయ దళపతి విజయ్ అప్ కమింగ్ మూవీ జననాయగన్(Jana Nayagan)రేపు ప్రీమియర్స్ నుంచే అడుగుపెడుతుండటంతో సినిమా గొప్ప తనం గురించి మరో సారి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుంది. మరి ఆ చర్చల వెనక ఉన్న పూర్తి విషయం ఏంటో చూద్దాం.