English | Telugu

సంగీత దర్శకురాలిగా మమతా మోహన్ దాస్

నటి మమతా మోహన్ దాస్ గుర్తుందా...? ఆమె మంచి గాయని కూడా. "ఆకలేస్తే అన్నం పెడతా" అంటు ఆమె పాడిన పాట హీరోయిన్ గా కన్నా మమతా మోహన్ దాస్ కు మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది. యన్ టి ఆర్ "యమదొంగ" చిత్రంలో "అబ్బయ్యా" అంటూ రాగాలు తీస్తూ డైలాగులు చెప్పిన మమతా మోహన్ దాస్ ఆ తర్వాత వెంకటేష్ సరసన "చింతకాయల రవి" చిత్రంలో నటించినా ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు.

ఇప్పటికే మమతా మోహన్ దాస్ కు గాయనిగా పేరుండటం వల్ల, తనకు కూడా సంగీతం కొద్దో గొప్పో పట్టుండటం వల్లా తాను సంగీత దర్శకురాలిగా మారాలని అనుకుంటుందట. మరి మమతా మోహన్ దాస్ కోరికను ఏ నిర్మాతలు నెరవేరుస్తారో వేచి చూడాలి. అది గాక ఈ మధ్య మమతా మోహన్ దాస్ కు ఆరోగ్యం కూడా సరిగ్గా లేదని తెలిసింది. దాన్ని దృష్టిలో పేట్టుకుని కూడా మమతా మోహన్ దాస్ ఈ నిర్ణయం తిసుకుని ఉండొచ్చని సినీ జనం అంటున్నారు. ఆల్ ది బెస్ట్ మమతా మోహన్ దాస్.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.