English | Telugu

పెళ్ళికి ముందు ప్రెగ్నెంట్ అయ్యింది నేనే కాదు.. ఇదిగో ఆ లిస్ట్  

భారతీయ సినీ చరిత్రలో ప్రముఖ బాలీవుడ్ నటి 'నేహా ధూపియా'(Neha Dhupia)స్థానం ప్రత్యేకమైనది. రెండున్నర దశాబ్దాలపై నుంచి కొనసాగుతున్న తన సినీ జర్నీలో హీరోయిన్ గా, క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, విభిన్న చిత్రాల్లో చేస్తు తన సత్తా చాటుతుంది. పలు టెలివిజన్ షోస్ లోను చేస్తు, ఆయా షోస్ కి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తున్న నేహా, 2018 లో ప్రముఖ నటుడు అంగద్ బేడీ ని వివాహం చేసుకుంది. ఈ ఇద్దరికి ప్రస్తుతం ఇద్దరు పిల్లలు.

రీసెంట్ గా నేహా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు 'పెళ్లికి ముందే గర్భం దాల్చిన విషయంపై కొన్నేళ్లుగా సోషల్ మీడియాలో ట్రోలింగ్‌ కి గురవుతున్నాను. పెళ్లికి ముందే గర్భవతిని అవ్వడం తప్పని నేను అనుకోవడం లేదు. అయినా అలాంటి పరిస్థితిని ఎదుర్కున్నది నేను ఒక్కదాన్నే కాదు. అలియా భట్, నీనా గుప్తా లాంటి వాళ్ళతో పాటు మరికొంత మంది కూడా నాలాగే పెళ్లికి ముందు గర్బవతులయ్యారు. కానీ చాలా మంది నెటిజన్లు నన్నే లక్ష్యంగా చేసుకుని విమర్శిస్తున్నారు. అంగద్ బేడీతో ప్రేమలో ఉన్నప్పుడే గర్భం దాల్చడంతో హడావిడిగా వివాహం చేసుకోవాల్సి వచ్చింది.
ఆ సమయంలో మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురయ్యాను. పెళ్లి కాకుండానే గర్భవతినయ్యాననే విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడం చాలా కష్టంగా అనిపించింది. సంప్రదాయ కుటుంబమైనా, కాకపోయినా ఇబ్బందికరమైన విషయమే. ఈ కారణంగానే వివాహానికి అత్యంత సన్నిహితులని పిలవకపోయానని నేహా చెప్పుకొచ్చింది.

అంగద్ బేడీ(Angad Bedi)నటుడుగా పలువురు అగ్ర హీరోల సినిమాల్లో కీలక పాత్రలు పోషించాడు. నేహా కంటే వయసులో మూడేళ్లు చిన్నవాడు. నేహా తెలుగులో రాజశేఖర్ డ్యూయల్ రోల్ లో వచ్చిన 'విలన్' హీరోయిన్ గా చేసింది. ఆ తర్వాత 'గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ(Balakrishna)దర్శక రత్న దాసరి నారాయణరావు(Dasari Narayanarao)కాంబోలో వచ్చిన 'పరమవీర చక్ర' లో కీలక పాత్రలో మెరిసింది. 2002 మిస్ యూనివర్స్(Miss Universe)పోటీల్లో ఇండియా(India)తరుపున పాల్గొని టాప్ టెన్ ఫైనలిస్ట్ లో ఒకటిగా నిలిచిన నేహా ఇప్పటి వరకు సుమారు యాభై కి పైగా చిత్రాల్లో నటించింది.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.