English | Telugu
నజ్రియా పాపకు పెళ్ళంట...!
Updated : Jan 20, 2014
సినీ ఇండస్ట్రీకి వచ్చిన కొద్దికాలంలోనే హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకున్న తమిళ హీరోయిన్ నజ్రియా త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది. ప్రముఖ దర్శకుడు ఫాజిల్ కుమారుడు, మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ తో నజ్రియా పెళ్లి కాబోతుంది. వీరి వివాహానికి ఇరు కుటుంబాలు అంగీకరించినట్టు తెలిసింది. ఆగస్టులో నజ్రియా, ఫాహద్‌ల వివాహం జరుగనుందని వారి కుటుంబవర్గాల ద్వారా తెలిసింది. నజ్రియా కూడా ఇటీవలే తమ నిశ్చితార్థం జరిగిందని సోషల్ మీడియా ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. వీళ్లిద్దరూ ప్రస్తుతం "ఎల్ ఫర్ లవ్" అనే మలయాళ రొమాంటిక్ చిత్రంలో నటిస్తున్నారు.