English | Telugu
అతడిని ఎప్పటికి క్షమించదట
Updated : Jan 28, 2014
నయనతార, శింబులు కొంతకాలం వరకు ప్రేమించుకుని తర్వాత ఇద్దరు విడిపోయారు. ఆ తర్వాత హీరోయిన్ హన్సికతో శింబు, డైరెక్టర్ ప్రభుదేవాతో నయనతార ప్రేమాయణం సాగించారు. కానీ ఏం జరిగిందో ఏమో అటు హన్సికను శింబు, ఇటు ప్రభుదేవాను నయనతార వదిలించేసుకున్నారు. శింబు గురించి హన్సికను అడిగితే.."సమయం వచ్చినపుడు అన్ని నేనే చెప్తాను" అని అంటుంది. అయితే తాజాగా మళ్ళీ శింబు, నయనతారలు ఇద్దరు కలిసిపోయారు. వీరిద్దరూ మళ్ళీ ప్రేమపక్షులుగా మారిపోయారు. ఇటీవలే ఓ తమిళ మీడియా "శింబుని క్షమించేసారు కదా? అలాగే ప్రభుదేవాను కూడా క్షమించినట్లేనా? " అని అడిగారు. దానికి సమాధానంగా నయన "మొదటి వ్యక్తిని క్షమించాను. కానీ మీరు చెప్పిన ఆ రెండో వ్యక్తిని ఎప్పటికీ క్షమించాను" అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయిందట. అంటే నయనతార క్షమించనంతగా ప్రభుదేవా ఏం చేసాడు? అని తెలుగు, తమిళ, హిందీ సినీ పరిశ్రమలలో ఇపుడు ఇదే హాట్ టాపిక్ అయ్యింది.