English | Telugu
చిరు కంటే చెర్రీయే బెటర్
Updated : Jan 29, 2014
రామ్ చరణ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన "ఎవడు" చిత్రం ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులు సినిమా ప్రమోషన్స్ ను మరింతగా పెంచేసారు. ఈ ప్రమోషన్స్ లో చరణ్ కు తల్లి పాత్రలో నటించిన జయసుధ మాట్లాడుతూ..."ఒక మెగా హీరోకి తనయుడైనప్పటికి కూడా చెర్రీ మాత్రం తండ్రిని కాపీ చేయకుండా తనకి తాను ఓ సెపరేటు స్టైల్ ను అలవర్చుకున్నాడు. అంతేకాదు... చిరుకి అభ్యంతరం లేకపోతె ఓ మాట చెప్పాలనుకుంటున్నాను. డ్యాన్స్ విషయంలో చిరు కన్నా చెర్రీయే బెటర్ అని" చరణ్ పై ప్రశంసల వర్షం కురిపించింది.