English | Telugu

'ఫర్జీ' వెబ్ సిరీస్ రివ్యూ


వెబ్ సిరిస్: ఫర్జీ
నటీనటులు: షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి, రాశీ ఖన్నా, కెకె మీనన్, భువన్ అరోర, అమోల్ పాలేకర్, జాకీర్ హుస్సేన్, విజయ్ కుమార్, సౌరవ్ చక్రబర్తి, రెజీనా, చిత్తరంజన్ గిరి తదితరులు
ప్రొడ్యూసర్స్ & డైరెక్టర్స్: రాజ్ అండ్ డీకే
సినిమాటోగ్రఫీ: తరుణ్ అచపల్, ప్రతా నారంగ్, అమిత్ సురేంద్రన్, పంకజ్ కుమార్.
సంగీతం: మానుయ్ దేశాయ్
ఎడిటర్ : సుమీత్ కోటియాన్
స్టంట్స్: అజీజ్ గులాబ్
ప్రొడక్షన్ కంపెనీ: డీ2ఆర్ ఫిలిమ్స్
ఓటిటి : అమెజాన్ ప్రైమ్ వీడియో

ఫ్యామీలీ మ్యాన్ లాంటి సూపర్ డూపర్ హిట్ సిరీస్ అందించిన రాజ్& డీకే నుండి వచ్చిన తాజా వెబ్ సిరీస్ ఫర్జీ. బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్ మొదటిసారి నటించిన సీరీస్ కాగా, సౌత్ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి కూడా ఇందులో భాగంగా కావడంతో ఈ సిరీస్ పై మరింత అంచనాలు పెరిగాయి. ఈ సిరీస్‌ కథేంటి? ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం...

కథ:

పది నిమిషాలలో పని పూర్తి చేయాలని చెప్పిన నాన్న మాట అని సందీప్ అలియాస్ సన్నీ(షాహిద్ కపూర్) కథ మొదలుపెడతాడు. సన్నీ చిన్నప్పుడే తల్లి చనిపోవడంతో, నాన్న అప్పులు చేస్తూ వారిని ఎదుర్కోలేక అన్ని ఊర్లకి తిప్పుతుంటాడు. ఒకరోజు ట్రైన్ లో తాతయ్య దగ్గరకి వెళ్తున్నామని చెప్పి తీసుకెళ్ళి అక్కడ వదిలేసి వెళ్ళిపోతాడు సన్నీ నాన్న. ఆ తర్వాత సన్నీ వాళ్ళ నాన్న కోసం రైల్వేస్టేషన్ లో ఎదురుచూస్తుంటాడు. అతడికి పెయింటింగ్స్ అంటే ఇష్టం ఉండటం వల్ల రైల్వే స్టేషన్ లో బొమ్మలు గీసేవాడు. ఆ బొమ్మలు చూసి వాళ్ళ నాన్న వస్తాడేమోనని ఎదురుచూస్తాడు. అక్కడ సన్నీకి ఫిరోజ్(భువన్ అరోర) మిత్రుడవుతాడు. ఆ తర్వాత నాన్న రాడని తెలుసుకుంటాడు. కొన్నిరోజులకు సన్నీని వెతుక్కుంటూ వాళ్ళ తాతయ్య మహదేవ్(అమోల్ పాలేకర్) వచ్చి అతడిని, ఫిరోజ్ ని తీసుకెళ్తాడు. మహదేవ్ ఒక పత్రిక ఆఫీస్ ని నడిపిస్తుంటాడు. అయితే అందులో పనిచేసేవారికి కూడా జీతాలు ఇవ్వలేక, బ్యాంక్ నుండి తీసుకున్న లోన్ క్లియర్ చేయక, ఏమీ చేయలేకపోతున్న తాతయ్య బాధని చూసి సన్నీ దొంగనోట్లు ముద్రించి అక్రమంగా అయినా డబ్బు సంపాందించాలనుకుంటాడు. ఫిరోజ్(భువన్ అరోడా), సన్నీ కలిసి పేపర్ మిల్లు లో ని కొంత పేపర్ ని దొంగిలిస్తారు. ఆ పేపర్ తో వాళ్ళ తాతయ్య ఆఫీస్ లో దొంగనోట్లను ముద్రిస్తారు. అయితే ఆర్బిఐ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఆఫీసర్ మైఖెల్ వేదనాయగం(విజయ్ సేతుపతి) దొంగనోట్లు చలామణి చేసే గ్యాంగ్ లను పట్టుకుంటాడు. మన్సూర్ దలాల్( కేకే మీనన్) అంతర్జాతీయ మార్కెట్ లో దొంగనోట్లు చలామణి చేస్తుంటాడు. అయితే మన్సూర్ కి సన్నీకి మధ్య సంబంధం ఏంటి? మన్సూర్ ని పట్టుకోడానికి పోలీసులు ఏం చేశారు? ఆ తర్వాత సన్నీ, ఫిరోజ్ లు కలిసి ఏం చేశారో తెలియాలంటే ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే!

విశ్లేషణ:

ఫేక్ కరెన్సీపై ఇప్పటికి చాలానే సినిమాలు వచ్చాయి. అయితే సస్పెన్స్ సీన్స్, ట్విస్ట్ లు ఇటువంటి కథకి బలంగా నిలుస్తాయి. అయితే ఈ వెబ్ సిరిస్ లో మొదటి ఎపిసోడ్ మొత్తం క్యారెక్టర్ లని పరిచయం చేయడానికే సరిపోయింది. ఇక రెండూ మూడు ఎపిసోడ్‌ లలో అసలు కథ మొదలవుతుంది. మొదట చిన్న ఆశతో.. సన్నీ తన తాతయ్య కోసం దొంగనోట్లను ముద్రిస్తాడు. ఆ తర్వాత ఆశ కాస్త అత్యశలా మారి అక్రమంగా డబ్బు సంపాదించాలనుకుంటాడు. ఆర్బిఐ ఫేక్ కరెన్సీ గుర్తుపట్టేందుకు ధనరక్షక్ అనే సాఫ్ట్‌వేర్ ని కనిపెట్టడంతో కథ ఆసక్తికరంగా సాగుతుంది. అయితే సన్నీ తయారుచేసిన కరెన్నీని ఆ సాఫ్ట్‌వేర్ గుర్తించకపోవడంతో, మన్సూర్ సన్నీని కిడ్నాప్ చేసి తనకు నచ్చినట్టు వాడుకోవాలనుకుంటాడు. ఆ తర్వాత కథ మరింత ఆసక్తిని పెంచుతుంది. ఈ మధ్యకాలంలో వచ్చిన వెబ్ సిరీస్ లలో సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ ఉన్నవి దాదాపు విజయాన్ని అందిపుచ్చుకున్నాయి. అలాంటి కోవలోకే ఇప్పుడు ఈ 'ఫర్జీ' చేరింది. ప్రారంభ ఎపిసోడ్స్ లో ఇంట్రడక్షన్స్, లవ్ ట్రాక్, మైఖెల్ (విజయ్ సేతుపతి) కి అతని పై ఆఫీసర్ కి మధ్య సాగే కొన్ని సీన్స్ స్లో గా నడిచినా పర్వాలేదనిపిస్తాయి. చివరి ఎపిసోడ్స్ లో ప్రేక్షకుడు పూర్తిగా కథలోనే ఉంచేలా డైరెక్టర్ తీర్చిదిద్దిన తీరు బాగుంది. సన్నీ అక్రమంగా కరెన్సీని చలామణీ చేసేప్పుడు, సన్నీ పోలీసుల మధ్య సాగే సీన్స్ కి గూస్ బంప్స్ వస్తాయి.

పోలీసుల కళ్ళు కప్పి.. సన్నీ ముద్రించిన ఫేక్ కరెన్సీని చలామణి చేసే తీరు నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. చివరి మూడు ఎపిసోడ్‌లలో కథ సాగే తీరు ప్రేక్షకులకు ఎంగేజింగ్ గా ఉంటుంది. స్క్రీన్‌ప్లే గ్రిస్లింగ్ గా ఉండటం, క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ తో ఈ సిరీస్ పై మరిన్ని అంచనాలను పెంచేశాయి. చివరి ఎపిసోడ్ లో ఒక ట్విస్ట్ తో ముగించడమనేది సగటు ప్రేక్షకుడిని ఆకట్టుకుంటుంది. డబ్బుకి ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పే డైలాగ్స్ కొన్ని బాగుంటాయి. స్లో సీన్స్ మినహా.. ఈ సిరిస్ లో అడల్ట్ కంటెంట్ ఏమీ లేదు కాకపోతే ఎక్కువగా అసభ్య పదజాలాన్ని ఉపయోగించారు. ఈ సిరీస్ ని చూసేప్పుడు వీలైనంతవరకు ఒంటరిగా చూడటమే బెటర్.

మానుయ్ దేశాయ్ అందించిన నేపథ్య సంగీతం వెబ్ సిరిస్ కి ప్రాణం పోసింది. అజీజ్ గులాబ్ స్టంట్స్ ఈ కథకి ఎంతమేరలో ఉండాలో అంతే ఉన్నాయని చెప్పాలి. తరుణ్ అచపల్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఈ సిరిస్ మొత్తంగా ఎనిమిది ఎపిసోడ్ లు.. ప్రతీదీ సుదీర్ఘంగా సాగుతుంది. ఎడిటర్ సుమీతా కోటియాన్ ఫస్టాఫ్ లో వచ్చే స్లో సీన్స్ తీసేస్తే.. ఈ కథకి మరింత బలంగా ఉండేది. డైరెక్టర్స్ రాజ్ అండ్ డీకే కథని నడిపిన తీరు‌ బాగుంది. ఎక్కువగా ట్విస్ట్ లు ఏమీ లేకపోయినా కథనం బాగుంది.

నటీనటుల పనితీరు:

షాహిద్ కపూర్ కి ఇదే మొదటి వెబ్ సిరీస్. సందీప్ అలియాస్ సన్నీ పాత్రలో షాహిద్ కపూర్ ఒదిగిపోయాడు. సన్నీ సామాన్యుడిగా ఉండి డబ్బు సంపాదించాలనే ఒక మధ్యతరగతి వాడి ఆలోచనాసరళికి దగ్గరగా ఉండటంతో ప్రతీ ఒక్కరు ఈ క్యారెక్టర్ కి చివరి వరకూ కనెక్ట్ అయ్యి ఉంటారు. షాహిద్ కపూర్ తన నటనలో ఎక్కడా అతి ప్రదర్శించలేదు. అయితే సన్నీ పాత్రని ఇంకా స్ట్రాంగ్ గా డిజైన్ చేస్తే బాగుండనిపించింది. స్పెషల్ ఆఫీసర్ గా మైఖెల్ వేదనాయగం పాత్రలో విజయ్ సేతుపతి ఆకట్టుకున్నాడు. అయితే ఆయన ఫ్యామీలీ సీన్స్ కొన్ని బోర్ కొట్టిస్తాయి. సేతుపతికి డబ్బింగ్ వాయిస్ అంతగా మ్యాచ్ కాలేదనే చెప్పాలి. మన్సూర్ దలాల్ గా కెకె మీనన్ అదరగొట్టాడు. ఇక ఫేక్ కరెన్సీ నీ కనిపెట్టే ఆఫీసర్ గా రాశీ ఖన్నా పర్వాలేదనిపించింది. సన్నీ తాతయ్య మహదేవ్ పాత్రకి అమోల్ పాలేకర్ న్యాయం చేశాడు. సన్నీ ఫ్రెండ్ ఫిరోజ్ గా భువన్ అరోర బెస్డ్ సపోర్టింగ్ ఇచ్చాడు. తన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. రెజీనా, జాకీర్ హుస్సేన్, విజయ్ కుమార్ ఇంకా తదితరులు ఉన్నంతలో బాగానే చేశారు.

తెలుగువన్ పర్ స్పెక్టివ్:

అత్యాశతో అక్రమంగా డబ్బు సంపాదించాలనుకుంటే.. ఎలాంటి సమస్యలు వస్తాయో చూపిన ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'ఫర్జీ' ని హ్యాపీగా చూడొచ్చు.

రేటింగ్: 3 / 5

✍🏻. దాసరి మల్లేశ్

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.