English | Telugu
గుడ్ బై చెప్పనున్న నయనతార... ఈ నిర్ణయం వెనుక రీజన్ అదేనా?
Updated : Sep 22, 2023
నయనతారకు హీరోయిన్‌గా సౌత్‌లో వున్న ఫాలోయింగ్ అందరికీ తెలిసిందే. లేడీ సూపర్‌స్టార్‌గా దూసుకుపోతున్న నయన్‌కు బాలీవుడ్‌లో చుక్కెదురైనట్టుంది. ఇకపై బాలీవుడ్ సినిమాల జోలికి వెళ్ళనంటోంది. షారూక్ ఖాన్, నయనతార జంటగా అట్లీ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘జవాన్’ కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికీ జోరు తగ్గకుండా దూసుకెళ్తున్న ఈ సినిమా తనకు ఓ పీడకలలా మిగిలిపోతుందని నయనతార భావిస్తోందని తెలుస్తోంది.
విషయం ఏమిటంటే.. అట్లీ ఈ కథ చెప్పినపుడు బాలీవుడ్‌లో తన ఎంట్రీకి మంచి సినిమా దొరికిందని ఎంతో సంతోషపడిరది నయన్. సినిమా చేస్తున్నప్పుడు కూడా తనకు ఎంతో ప్రాధాన్యం ఉందనే భావించిందట. తీరా సినిమా రిలీజ్ అయిన తర్వాత చూస్తే తను మెయిన్ హీరోయిన్ అయినా, ఎక్కువ ఇంపార్టెన్స్ దీపికా పదుకొనేకే ఇచ్చినట్టు అర్థమైందని అంటోంది నయన్. ఇప్పుడది షారూక్`దీపిక సినిమాగా మారిపోయిందని, తనను పక్కన పెట్టేసారని, అది తనకెంతో అవమానంగా ఉందని బాహాటంగానే విమర్శిస్తున్నట్టు తెలుస్తోంది.
ఇక బాలీవుడ్ సినిమాలకు గుడ్‌బై చెప్పాలని నయన్ నిర్ణయించుకుందని తెలుస్తోంది. సౌత్‌లో తన కెరీర్‌ను కొనసాగించాలని ఫిక్సయిందట. ఒకవేళ తప్పనిసరై బాలీవుడ్ సినిమా చెయ్యాల్సి వస్తే ‘జవాన్’ సినిమాకి జరిగిన అవమానం మళ్ళీ మళ్ళీ జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే సినిమా ఓకే చెయ్యాలని నిర్ణయించుకుందని సమాచారం. అలాంటి కథలతో వచ్చేవారు తను పెట్టే కండీషన్స్‌కి ఒప్పుకుంటే ఆలోచిస్తానని చెప్పినట్టు సమాచారం.