English | Telugu
సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన 'బెదురులంక'
Updated : Sep 22, 2023
కార్తికేయ, నేహా శెట్టి జంటగా క్లాక్స్ దర్శకత్వంలో రూపొందిన సినిమా 'బెదురులంక 2012'. లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ మూవీ ఆగస్టు 25న థియేటర్లలో విడుదలై కమర్షియల్ గా మంచి విజయాన్ని సాధించింది. అయితే ఇప్పుడు ఈ సినిమా ఎలాంటి ప్రకటన లేకుండా సైలెంట్ గా ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది.
'బెదురులంక 2012' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. ఇటీవల మెజారిటీ సినిమాలు థియేటర్లలో విడుదలైన నాలుగు వారాలకే ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్నాయి. బెదురులంక కూడా నాలుగు వారాలకే ఓటీటీలోకి అడుగు పెట్టింది. ఎటువంటి ప్రకటన లేకుండానే ఈరోజు(సెప్టెంబర్ 22) నుంచి అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి వచ్చింది. మరి ఈ సినిమాకి ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.
ఈ సినిమాలో అజయ్ ఘోష్, వెన్నెల కిశోర్, సత్య, రాజ్ కుమార్ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగర్, గోపరాజు రమణ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. మణిశర్మ సంగీతం అందించారు.