English | Telugu
టోరీ, నాట్స్ ల కలయికలో ఐడల్ షో
Updated : Jun 24, 2011
నాట్స్ (నార్త్ అమెరికా తెలుగు సొసైటీ) అమెరికా, టోరీ కలసి నిర్వహించిన అమెరికన్ ఇండియన్ ఐడిల్ షో పోటీలకు బ్రహ్మాండమైన స్పందన లభిస్తూంది. మోహన్ వేనిగళ్ళ "టోరీ"ని స్థాపించారు. అసలు టోరీ అంటే "తెలుగు వన్ రేడియో ఆన్ ఇంటర్నెట్" అని అర్థం. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మన తెలుగు వారి కోసం ఏర్పాటు చేసి, 24 గంటలూ ప్రసారాలను అందించే గ్లోబల్ రేడియో. ఇందులో రోజుకి పది గంటల పాటు లైవ్ ప్రోగ్రాములుంటాయి. అలాంటి టోరీ, నాట్స్ అమెరికా వారితో సంయుక్తంగా నిర్వహించిన అమెరికన్ ఇండియన్ ఐడిల్ షో సింగింగ్ కాంపిటీషన్ లో 160 మందికి పైగా పాల్గొన్నారు.
ఈ పోటీలను గత నాలుగు నెలలుగా నిర్వహిస్తున్నారు. ప్రవాసాంధ్రుల్లో దాగి ఉన్న గాన ప్రతిభను వెలికి తీసేందుకే ఈ పోటీలను వీరు నిర్వహించారు. ఈ పోటీల్లో ఫైనల్స్ కు వచ్చిన విజేతలు జూలై 1,2,3, తేదీల్లో, నాట్స్ అమెరికా వారు నిర్వహించే వార్షికోత్సవసభలో పాల్గొంటారు. అంటే ఫైనల్స్ అక్కడ జరుగుతాయి. రామాచారి ఈ పోటీలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. ఈ సభలకు ముఖ్య అతిథిగాప్రముఖ యువ హీరో రామ్ చరణ్ రానున్నారు.