English | Telugu

సింగనమల రమేష్ వెనుక సి.కళ్యాణ్ ఉన్నాడు - వైజయంతీ రెడ్డి

"సింగనమల రమేష్ వెనుక సి.కళ్యాణ్ ఉన్నాడు" అని సింగనమల రమేష్ సినిమాలకు 7.5 cr ఫైనాన్స్ చేసిన వైజయంతీ రెడ్డి అంటున్నారు. వివరాల్లోకి వెళితే ప్రముఖ సినీ ఫైనాన్సియర్, నిర్మాత అయిన సింగనమల రమేష్ సినిమాలకు 7.5 cr ఫైనాన్స్ చేసిన వైజయంతీ రెడ్డి సింగనమల రమేష్ అరెస్ట్ పై స్పందిస్తూ " సింగనమల రమేష్ మాకు ఫ్యామిలీ ఫ్రెండ్. అందుకే అతన్ని నమ్మి 7.5 cr అప్పుగా ఇచ్చాం. ఆ తర్వాత అతను భాను కిరణ్ తో కలసి నా భర్తని బెదిరించాడు. అదేమిటంటే నా వెనుక మద్దులచెరువు సూరి ఉన్నాడని అనేవాడు. దాంతో మేము సిసియస్ లో అతని మీద ఫిర్యాదు చేశాము.

చెన్నైలో అతని తండ్రి సింగనమల సత్తి రంగయ్యను కలిస్తే అక్కడ కూడా మాకు సూరి తెలుసు అని బెదిరించి, మా అబ్బాయికీ మాకూ ప్రస్తుతం సంబంధాలు లేవు. అతను మా ఇంటికి రాడు అని అన్నారు. సింగనమల రమేష్ మాకు ఇవ్వాల్సిన బాకీ గురించి మాట్లాడటానికి బాలాజీ కలర్ ల్యాబ్ కి రమ్మన్నాడు. సి.కళ్యాణ్ ప్రమేయం ప్రత్యక్షంగా లేకపోయినా పరోక్షంగా సింగనమల రమేష్ విషయంలో కచ్చితంగా ఉంది. లేకుంటే మమ్మల్ని బాలాజీ కలర్ ల్యాబ్ కే రమ్మని సింగనమల రమేష్ ఎందుకంటాడు....?" అని అంటున్నారు.

రికార్డుల వేటలో మన శంకర వరప్రసాద్ గారు.. రెండు రోజుల కలెక్షన్స్ ఇవే 

సిల్వర్ స్క్రీన్ పై మనశంకరవరప్రసాద్ గారు(Mana Shankara Varaprasad Garu)వెంకీ గౌడ ల జులుం యధావిధిగా కొనసాగుతుంది. ఎనామనస్ గా అన్ని ఏరియాల ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తుండటంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కలకలలాడుతున్నాయి. దీంతో హిట్ కోసం ఎదురుచూస్తున్న చిరంజీవికి ఏకంగా బ్లాక్ బస్టర్ హిట్ దక్కినట్లయింది. కలెక్షన్స్ పరంగా కూడా చిరంజీవి కెరీర్ లోనే హయ్యస్ట్ నెంబర్ ని వసూలు చేసే అవకాశం ఉందని సినీ ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. మరి ఇప్పటి వరకు  మన శంకర వర ప్రసాద్ రాబట్టిన కలెక్షన్స్ ని చూద్దాం.