English | Telugu
ఓటీటీలో 'నారాయణ అండ్ కో' సినిమాకి సూపర్ రెస్పాన్స్!
Updated : Sep 5, 2023
'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' మూవీతో టాలీవుడ్ కు పరిచయమైన నటుడు సుధాకర్ కోమాకుల నటింటిన తాజా చిత్రం 'నారాయణ అండ్ కో'. ఈ మూవీ జూన్ 30వ తేదీన థియేటర్లలో విడుదలై మంచి స్పందనతో అలరించింది. పాపిశెట్టి ఫిల్మ్ ప్రొడక్షన్స్, సుఖ మీడియా పతాకాలపై పాపిశెట్టి బ్రదర్స్ సహకారంతో సుధాకర్ ఈ మూవీని నిర్మించారు. చిన పాపిశెట్టి ఈసినిమాకు దర్శకత్వం వహించారు.
'ది తిక్కల్ ఫ్యామిలీ' ట్యాగ్ లైన్ తో 'నారాయణ అండ్ కో' మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నారాయణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చుట్టూ తిరిగే కథతో ఫన్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా ఎంటర్‌టైనింగ్ గా ఉంటుంది. మధ్య తరగతి కుటుంబాన్ని లీడ్ చేసే యజమాని నారాయణ పాత్రలో దేవీ ప్రసాద్ ప్రేక్షకులను తనదైన శైలిలో అలరించారు. ఆయన భార్య పాత్రలో సీనియర్ నటి ఆమని నటించగా.. కొడుకు పాత్రలో సుధాకర్ నటించి మెప్పించారు.
సెప్టెంబర్ 4 నుండి 'నారాయణ అండ్ కో' సినిమా ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడంతో థియేటర్స్ లో మిస్ అయిన ప్రేక్షకులు ఈ సినిమాను ఓటీటీలో చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో ఓటీటీలో ఈ సినిమాకి విశేష స్పందన లభిస్తోంది.