English | Telugu

‘ఓజీ’ అంటే ఒరిజినల్‌ గ్యాంగ్‌స్టర్‌ కానే కాదు.. కొత్త అర్థం చెప్పిన నారా లోకేష్

పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ లేటెస్ట్‌ సెన్సేషన్‌ ‘ఓజీ’ ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. బుధవారం రాత్రి నుంచే అభిమానుల సందడి మొదలైంది. సినిమా చూసిన తర్వాత ఫ్యాన్స్‌ సంతోషానికి అవధుల్లేవు. చాలా కాలం తర్వాత ఒక సాలిడ్‌ హిట్‌తో వచ్చిన పవర్‌స్టార్‌.. అభిమానుల ఆకలిని తీర్చారు. ఈ సినిమా రిలీజ్‌ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌ ‘ఓజీ’ చిత్రం గురించి చేసిన సంచలన కామెంట్‌ ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ సినిమాకి సంబంధించిన గ్లింప్స్‌, ట్రైలర్‌ రిలీజ్‌ అవ్వక ముందు ఓజీ అంటే అందరూ ఒరిజినల్‌ గ్యాంగ్‌స్టర్‌ అంటూ చెప్పడం మొదలెట్టారు. సినిమాలో ఓజీ అంటే ఓజస్‌ గంభీర అంటూ ప్రొజెక్ట్‌ చెయ్యడం మనం చూశాం. ఇప్పుడు దానికి భిన్నంగా నారా లోకేష్‌ ఓజి అంటే ‘ఒరిజినల్‌ గాడ్‌’ అంటూ ఓ ట్వీట్‌ చెయ్యడం సంచలనంగా మారింది. చిత్ర బృందానికి తన బెస్ట్‌ విషెస్‌ అందజేస్తూ ఓజీకి కొత్త అర్థాన్ని చెప్పారు నారా లోకేష్‌.

‘ఓజీ’ అంటే ఒరిజినల్‌ గ్యాంగ్‌స్టర్‌. మా పవన్‌ అన్న అభిమానులకు మాత్రం ఒరిజినల్‌ గాడ్‌. పవర్‌స్టార్‌ ఫ్యాన్స్‌ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘ఓజీ’ సినిమా విడుదల సందర్భంగా పవన్‌ అన్నకు శుభాకాంక్షలు. సినిమా సూపర్‌ హిట్‌ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని నారా లోకేష్‌ ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టారు. అంతకుముందు విడుదలైన హరిహర వీరమల్లు రిలీజ్‌ సందర్భంలోనూ నారా లోకేష్‌ బెస్ట్‌ విషెస్‌ చెబుతూ పోస్ట్‌ పెట్టిన విషయం తెలిసిందే.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.