English | Telugu

ఒకే బాటలో నందమూరి బ్రదర్స్!

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ 'దేవర'. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాని రెండు భాగాలుగా విడుదల చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు. మొదటి భాగం 2024, ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే తమ్ముడు ఎన్టీఆర్ బాటలోనే అన్నయ్య కళ్యాణ్ రామ్ కూడా పయనించనున్నట్లు తెలుస్తోంది.

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ పీరియాడి స్పై థ్రిల్లర్ ‘డెవిల్’. ఇందులో కళ్యాణ్ రామ్ బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్‌గా కనిపించనున్నాడు. నిర్మాత అభిషేక్ నామా 'డెవిల్' కోసం మెగాఫోన్ పట్టడం విశేషం. ఈ మూవీ ఈ ఏడాది నవంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికర న్యూస్ వినిపిస్తోంది. అదేంటంటే డెవిల్ కూడా రెండు భాగాలుగా రానుందట. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు స్టార్ట్ అయ్యాయని మొదటి భాగం విడుదల కాగానే, రెండో భాగం సెట్స్ పైకి వెళ్తుందని అంటున్నారు. రెండో భాగానికి కూడా అభిషేక్ నామానే దర్శకత్వం వహించే అవకాశముందని సమాచారం.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.