English | Telugu

ఐ డోంట్ కేర్ ఎన్టీఆర్..బాలకృష్ణ ఘాటు వ్యాఖ్య!


తెలుగు సినీ పరిశ్రమలో ఎంత మంది హీరోలు ఉన్న నందమూరి నట సింహం బాలకృష కి ఉన్న ప్రత్యేకతే వేరు. ఏ విషయాన్నీ అయినా నాన్చకుండా అవతలి వారికి అర్ధమయ్యేలా నిర్మొహమాటంగా తన అభిప్రాయాన్ని వెల్లడించడం బాలయ్య స్టైల్. అందుకే బాలయ్యకి అంత పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ప్రస్తుతం అటు సినిమాల్లోనూ,ఇటు రాజకీయాల్లోనూ ఫుల్ బిజీగా ఉన్న బాలకృష్ణ తాజాగా జూనియర్ ఎన్టీఆర్ గురించి అలాగే సినిమా ఇండస్ట్రీ గురించి చేసిన ఒక వ్యాఖ్య నందమూరి అభిమానులతో పాటు సినీ రాజకియ వర్గాల్లో సంచలనం సృష్టిస్తుంది.

గత కొన్ని రోజుల క్రితం తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన విషయం అందరికి తెలిసిందే. ఇక్కడ అందరు గమనించాలసిన విషయం ఏంటంటే తెలుగు దేశం పార్టీ వ్యవపాస్థాపకుడు కీర్తి శేషులు నందమూరి తారకరామారావు సినిమా పరిశ్రమ నుంచే వెళ్లి తెలుగు దేశం పార్టీని స్థాపించారు.ఆ నాటి నుంచే సినీ రంగానికి తెలుగుదేశం పార్టీ కి ఎంతగానో విడదీయరాని అనుబంధం ఉంది. ఎంతో మంది సినిమా వాళ్ళు తెలుగు దేశం పార్టీ తరుపున రాజకీయపరమైన పదవులని సైతం పొందారు. ఇది అందరికి తెలిసిన బహిరంగ రహస్యమే. అలాగే ఇక్కడో ఇంకో విషయం గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. పెద్దాయన అభిమానులు అంటే నందమూరి తారక రామారావు అభిమానులు ఆయన్ని ఎంతగా అభిమానిస్తారో అంతే అభిమానంతో బాలకృష్ణని అలాగే జూనియర్ ఎన్టీఆర్ ని కూడా అభిమానిస్తారు. ఇప్పుడు ఈ విషయం గురించి ఎందుకు చెప్పుకోవలసి వస్తుందంటే బాలకృష్ణ ని తాజాగా కొంత మంది విలేకర్లు చంద్రబాబు గారి అరెస్ట్ పై సినీ పరిశ్రమ స్పందించకపోవడంపై మీ అభిప్రాయం ఏంటి అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా స్పందించకపోవడం పై కూడా మీ స్పందన ఏంటి అని అడిగితే బాలయ్య వెంటనే ఏ మాత్రం తడుముకోకుండా ఐ డోంట్ కేర్ అని అన్నాడు. బాలయ్య చెప్పిన ఈ డైలాగ్ ఇప్పుడు ఒక్కసారిగా రెండు తెలుగు రాష్ట్రాలలో హీట్ ని రాజేస్తోంది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.