English | Telugu
బాబాయ్ అని పిలిస్తే దబిడి దిబిడే.. సంచలనంగా మారిన బాలయ్య కామెంట్స్!
Updated : Nov 10, 2023
తనని ఎవరైనా బాబాయ్ అని పిలిస్తే, దిబిడి దిబిడే అంటూ నందమూరి బాలకృష్ణ వార్నింగ్ ఇచ్చారు. కానీ ఇది ఆయన సీరియస్ గా ఇచ్చిన వార్నింగ్ కాదు, సరదాగా ఇచ్చిన వార్నింగ్. అయితే బాలయ్య వార్నింగ్ ఎలా ఇచ్చినప్పటికీ, ప్రస్తుతం ఈ మాట మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
బాలకృష్ణ రీసెంట్ మూవీ 'భగవంత్ కేసరి' బ్లాక్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం గ్రాండ్ సక్సెస్ సెలెబ్రేషన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "వయసులో నన్ను ఎవరైనా బాబాయ్ అనో, ఇంకేదో అనో పిలిస్తే.. జాగ్రత్తగా ఉండండి.. దబిడి దిబిడే అంటాను. అలాంటిది ఈ సినిమాలో శ్రీలీలకి చిచ్చాగా చేశాను. ఈ చిత్రంలో మంచి సందేశముంది. ఇలాంటి కథని చెప్పడం బాధ్యతగా తీసుకొని, ఈ పాత్రను అంగీకరించడం జరిగింది" అని బాలకృష్ణ అన్నారు.
అయితే "వయసులో నన్ను ఎవరైనా బాబాయ్ అని పిలిస్తే" అంటూ బాలకృష్ణ సరదాగా మాట్లాడిన మాటలను.. కొందరు "వయసులో" అనే పదాన్ని తీసేసి పరోక్షంగా జూనియర్ ఎన్టీఆర్ ని అన్నట్టుగా చిత్రీకరిస్తున్నారు. దీంతో నందమూరి అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.