English | Telugu

బాలకృష్ణతో లంచ్

యువరత్న, నందమూరి నటసింహం, నందమూరి బాలకృష్ణతో మీకు లంచ్ చేయాలనుందా...? హ్యాపీగా చేయవచ్చు. అలా మీరు నందమూరి బాలకృష్ణతో భిజనం చేయాలనుకుంటే మీరు అమెరికాలోని హోటల్ హాలిడే ఇన్, 3405 ఆల్ గోన్ క్వీన్, రోలింగ్ మిడోస్, ఐ యల్, 60008 కి వెళ్ళాలి. ఆ హోటల్ బాంక్వెట్ హాల్లో, ఆదివారం అంటే జూలై 10 వ తేదీ మధ్యాహ్నం 12.30 నుండి 2.30 వరకూ మీరు బాలకృష్ణతో భోజనం చేయవచ్చు. అందుకు మీరు చెల్లించాల్సిన మొత్తం 50 డాలర్లు మాత్రమే. ఇదేంటి నందమూరి బాలకృష్ణతో భోజనం చేయటానికి డబ్బు చెల్లించాలా....? అని మీరేం ఆశ్చర్యపోకండి. నందమూరి బసవరామతారకం స్మారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ కి ఆర్థిక వనరులు చేకూర్చే నిమిత్తం బాలకృష్ణ ఈ పథకాన్ని ఏర్పాటు చేశారు. ఇందుకు మీరు సంప్రదించాల్సిన వారి వివరాలు ఈ క్రింద ఇస్తున్నాం.

తెలుగు ఫ్రెండ్స్ బాంక్వెట్ డిటైల్స్ పెద్దలకు మాత్రమే : $50/ ఒక వ్యక్తికి

వివరాల కోసం సంప్రదించండి: రవి ఆచంట – 630-215-3483 విజయ్ వెనిగళ్ళ – 214-263-7148

హరీష్ కొలసాని – 847-553-8594 లక్ష్మీ నారాయణ తాతినేని – 630-747-8079 శ్రీనివాస్ చుండు – 630-747-7021

హేమ కానూరు – 630-532-3339 మూర్తి కొప్పాక – 224-622-6661

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .