English | Telugu

బాలకృష్ణ అభిమానికి లివర్ మార్పిడి... వసుంధర దేవి ఏం చేసిందంటే...

నందమూరి బాలకృష్ణ తను చేసే సినిమాల ద్వారానే కాదు, కొన్ని సేవా కార్యక్రమాల ద్వారా కూడా ప్రజలకు బాగా దగ్గరయ్యారు. తన తల్లి పేరు మీద స్థాపించిన బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రి ద్వారా గత కొన్ని సంవత్సరాలుగా సేవ చేస్తున్నారు. అంతేకాదు, ఎవరైనా ఆపదలో ఉన్నారంటే వెంటనే స్పందించి వారికి సాయం చేస్తుంటారు. తాజాగా అలాంటి ఓ సంఘటన ఆదోనిలో జరిగింది.

కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన బద్రి నారాయణస్వామి అనే వ్యక్తి ఎంతో కాలంగా బాలకృష్ణకు అభిమానిగా ఉన్నారు. గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు స్వామి. అందులో భాగంగా అతనికి లివర్‌ మార్పిడి చెయ్యాలని అవసరం వచ్చింది. అది ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. దాదాపు 20 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న బాలకృష్ణ.. తన అభిమాని చికిత్స కోసం ప్రభుత్వం తరఫున సహాయం అందేలా చూశారు. బద్రి స్వామికి 10లక్షలు ఎల్‌ఓసీని ప్రభుత్వం మంజూరు చేసింది. దీనికి సంబంధించిన పత్రాన్ని బాలకృష్ణ సతీమణి వసుంధర చేతుల మీదుగా స్వామికి అందజేశారు.

బద్రి నారాయణస్వామి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడన్న విషయాన్ని బాలకృష్ణ అభిమాన సంఘం అధ్యక్షుడు ద్వారా బాలయ్య తెలుసుకున్నారు. అభిమాని కోసం ప్రభుత్వం నుంచి సహాయం అందేందుకు కృషి చేసిన నందమూరి బాలకృష్ణను అభిమానులు ప్రశంసిస్తున్నారు. ఎల్‌ఓసీ పత్రాన్ని అందించిన వసుంధరకు, సహాయం అందేందుకు కృషి చేసిన నందమూరి బాలకృష్ణకు నారాయణస్వామి కృతజ్ఞతలు తెలిపారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.