English | Telugu
బాలయ్య కృష్ణా జిల్లా టూర్ గ్రాండ్ సక్సస్
Updated : Jan 9, 2012
బాలయ్య కృష్ణా జిల్లా టూర్ గ్రాండ్ సక్సస్ అయ్యింది. వివరాల్లోకి వెళితే ప్రముఖ తెలుగు సినీ హీరో యువరత్న నందమూరి బాలకృష్ణ నిన్న అంతే జనవరి 8 వ తేదీన, కృష్ణ జిల్లాలోని ఘంటసాల గ్రామంలో, తన తండ్రిగారైన విశ్వవిఖ్యాతనటసార్వభౌమ, నటరత్న, డాక్టర్ నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని ఆవిష్కరించటానికి వెళ్ళారు. వేలాదిమంది బాలకృష్ణ అభిమానులు వెంటరాగా, భారీ ర్యాలీగా ఆయన ఘంటసాల గ్రామానికి చేరుకున్నారు.
అక్కడ విగ్రహావిష్కరణకు ఎడ్లబండి మీద బాలయ్యే స్వయంగా తోలుకుంటూ రావటం ప్రజలను ఆశ్చర్యానందాలకు గురిచేసింది. విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. బాలయ్య తన ప్రసంగంలో ముఖ్యమంత్రి పథకాలను ఎండగట్టారు. అలాగే నటుడు చిరంజీవి అనవసరంగా రాజకీయాల్లోకి వచ్చి సినీ పరిశ్రమకు దూరమయ్యారనీ, ఆయనకు నిజానికి ప్రజాసేవ చెయ్యాలని లేదనీ అంటూ, తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలను వదిలేది లేదనీ, తమ పార్టీ అధిష్టానం రాయలసీమ, కోస్తా, తెలంగాణా ప్రాంతాల్లో ఎక్కణ్ణుంచి పోటీచేయమన్నా పోటీచేయటానికి తాను సిద్ధంగా ఉన్నాననీ అన్నారు.
ఆయన ఇంకా మాట్లాడుతూ రానున్న కాలంలో రాష్ట్ర రాజకీయాల్లో చాలా తమాషాలు జరుగుతాయని కూడా అన్నారు. అభిమానుల కోరిక మీద బాలయ్య తొడకొట్టి, మీసం తిప్పారు. బాలయ్య జరిపిన ఈ టూర్ కి జనం నుండి, తెలుగుదేశం కార్యకర్తల నుండీ, బాలయ్య అభిమానుల నుండీ విశేష స్పందన లభించింది.