కాంత మూవీ ఫస్ట్ రివ్యూ!
on Nov 13, 2025

విభిన్న చిత్రాలతో వివిధ భాషల ప్రేక్షకులకు చేరువైన మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్.. 'కాంత' అనే మరో ఆసక్తికర సినిమాతో రేపు(నవంబర్ 14) ప్రేక్షకులను పలకరించనున్నాడు. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా.. ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. 1950లలో హీరో, డైరెక్టర్ మధ్య ఇగో క్లాష్ నేపథ్యంలో రూపొందిందిన ఈ మూవీ యొక్క ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. (Kaantha Movie)
ముందుగానే 'కాంత' ప్రత్యేక షోలను ప్రదర్శిస్తున్నారు. తాజాగా తమిళ మీడియా కోసం స్పెషల్ షో వేయగా.. సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. ఫస్ట్ హాఫ్ లో డ్రామా బాగా పండిందని, ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ అదిరిపోయిందని అంటున్నారు. ఇక సెకండ్ హాఫ్ లో ఇన్వెస్టిగేషన్ జరిగిన తీరు కట్టిపడేసిందని చెబుతున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్ ట్విస్ట్ నెక్స్ట్ లెవెల్ అనే మాట వినిపిస్తోంది.
Also Read: ఇది నిజంగా రాజమౌళి సినిమాయేనా..?
దుల్కర్ సల్మాన్, సముద్రఖని పోటాపోటీగా నటించి సినిమాని మరోస్థాయికి తీసుకెళ్ళారట. భాగ్యశ్రీ బోర్సే తన నటనతో సర్ ప్రైజ్ చేసింది అంటున్నారు. కెమెరా, ఆర్ట్, మ్యూజిక్ ఇలా టెక్నికల్ డిపార్ట్మెంట్స్ కూడా గొప్ప పనితీరుని కనబరిచాయని చెప్తున్నారు.
మొత్తానికి 'కాంత' సినిమాకి తమిళ మీడియా నుండి పాజిటివ్ టాక్ వస్తోంది. మరి సాధారణ ప్రేక్షకుల నుండి ఎలాంటి స్పందన లభిస్తుందో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



