English | Telugu

యన్.టి.ఆర్.స్టుడియో నిర్మాణం

యన్.టి.ఆర్.స్టుడియో నిర్మాణంలో ఉందని విశ్వసనీయవర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే యువ హీరో యంగ్ టైగర్ యన్.టి.ఆర్. తన తాతగారైన విశ్వవిఖ్యాతనటసార్వభౌమ నందమూరి తారక రామారావు గారి పేర ఒక స్టుడియో కడుతున్నాడట. అది హైటెక్ సిటీకి ఓ పది కిలోమీటర్ల దూరంలోనే ఉందట. జూనియర్ యన్ టి ఆర్ మామ నార్నే శ్రీనివాసరావు తన అల్లుడికి 25 ఎకరాల స్థలాన్ని కట్నం రూపంలో ఒక భాగంగా ఇచ్చారట. ప్రస్తుతం ఆ స్థలంలోనే యన్.టి.ఆర్. తాతగారి పేరు మీద స్టుడియో నిర్మాణం చేపట్టారట.

మామూలుగా రామోజీరావు, సూపర్ స్టార్ కృష్ణ, అక్కినేని నాగేశ్వరరావు, కీర్తిశేషులు యన్. టి.ఆర్., డాక్టర్ రామానాయుడు వంటి పెద్దలు మాత్రమే స్టుడియోలను హైదరాబాద్ లో నిర్మించారు. ఇప్పటివరకూ ఏ యువ హీరో కూడా స్టుడియో నిర్మాణాన్ని చేపట్టలేదు. యువ హీరోల్లో స్టుడియో అధినేత అనిపించుకునే ఘనత ఒక్క యువ హీరో యంగ్ టైగర్ యన్.టి.ఆర్.కే దక్కుతుంది. ఈ విషయం యువ హీరో యంగ్ టైగర్ యన్.టి.ఆర్.మీడియాకు ఇంకా ధృవీకరించలేదు.

సైక్ సిద్ధార్ధ ఫస్ట్ డే కలెక్షన్స్ ఇవేనా! పగ వాడికి కూడా ఆ బాధ రాకూడదు

శ్రీ నందు(Shree Nandu)చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటు 2026 కి వెల్ కమ్ చెప్తు నిన్న 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha)తో సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయ్యాడు. పక్కా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కగా బాగానే ఉందనే టాక్ ని సొంతం చేసుకుంది.  రివ్యూస్ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి. పైగా సింగల్ స్క్రీన్స్ తో సహా మల్టి ప్లెక్స్ లో టికెట్ రేట్స్ ని భారీగా తగ్గించారు. దీంతో అందరి చూపు సైక్ సిద్దార్ధ వైపు పడిందనే టాక్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తుంది. మరి మొదటి రోజు ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం.