English | Telugu

వెంకీ, నాగ్‌ల మ‌ల్టీస్టార‌ర్‌?

తెలుగునాట మ‌ల్టీస్టార‌ర్ ట్రెండ్ దూకుడు చూపిస్తోంది. మ‌హేష్ - వెంకీ, వెంకీ - రామ్‌, వెంకీ - ప‌వ‌న్‌, నాగ‌చైత‌న్య - సునీల్‌... ఇలాంటి కాంబినేష‌న్లు చూసేశాం. ఇప్పుడు మ‌రో క్రేజీ క‌ల‌యిక రాబోతోంద‌ని టాలీవుడ్ టాక్‌. అదే వెంకటేష్‌, నాగార్జున‌. వీరిద్ద‌రూ క‌ల‌సి ఓ సినిమా చేయ‌బోతున్నార‌ని, ఈ చిత్రానికి వి.వి.వినాయ‌క్ ద‌ర్శక‌త్వం వ‌హిస్తార‌ని ఫిల్మ్‌న‌గ‌ర్ స‌మాచారం. బాలీవుడ్ క్లాసిక్ రామ్‌ల‌ఖ‌న్‌కి ఇది రీమేక్ అని తెలుస్తోంది. ప్ర‌స్తుతం వినాయ‌క్ అఖిల్ లాంచింగ్ ప్రాజెక్ట్ చేప‌ట్టారు. ఈ సినిమా పూర్త‌యిన వెంట‌నే వెంకీ, నాగ్‌ల‌తో సినిమా సెట్స్‌పైకి తీసుకెళ్లార‌ని తెలుస్తోంది. వెంకీ, నాగార్జున స‌మ‌కాలికులు. ఇద్ద‌రికీ కొత్త క‌థ‌లంటే మ‌క్కువ‌. మంచి క‌థ దొరికితే త‌మ ఇమేజ్‌ని ప‌క్క‌న పెట్టి మ‌రీ న‌టిస్తారు. అన్న‌ట్టు.... బంధుత్వం కూడా ఉంది. కానీ క‌ల‌సి మాత్రం ఒక్క సినిమా కూడా చేయ‌లేదు. ఆ లోటు వినాయ‌క్ పూడిస్తే అంత‌కంటే కావ‌ల్సిందేముంది..?

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.