English | Telugu
నాగార్జున ఇలా మాయ చేస్తాడని ఎవరు అనుకోలేదు!
Updated : Dec 13, 2023
తెలుగు చలన చిత్ర సీమలో ఉన్న అగ్రహీరోల్లో నాగార్జున కూడా ఒకరు. తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఆయన చూడని హిట్ గాని చూడని రికార్డు గాని లేదు. ఇప్పుడు తాజాగా మళ్ళీ తన సత్తా చాటడానికి నా సామి రంగా అనే యాక్షన్ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.మొన్నీ ఈ మధ్య ఈ సినిమా నుండి విడుదలైన ఎత్తుకెళ్లిపోతా అనే సాంగ్ ఇప్పుడు రికార్డు వ్యూస్ తో ముందుకు దూసుకుపోతుంది. తాజాగా ఇంకో క్రేజీ న్యూస్ ఈ సినిమా నుండి వచ్చింది.
నా సామిరంగా సినిమాలోని ఎత్తుకెళ్లిపోవాలనిపిస్తుందే పాటకి సంబందించిన మేకింగ్ వీడియోని కొద్దిసేపటి క్రితమే మేకర్స్ రిలీజ్ చేసారు .ఆ వీడియోలో ఫుల్ మాస్ గెటప్ లో పంచ కట్టుకొని ఉన్న నాగార్జున ఆషికా రంగనాధ్ తో కలిసి ఒక లెవెల్లో స్టెప్ లు వేస్తున్నాడు.చాలా సంవత్సరాల తర్వాత నాగార్జున తన మాస్ లుక్ తో ప్రేక్షకులని మాయ చెయ్యబోతున్నాడని మేకింగ్ వీడియో చూస్తే అర్ధం అవుతుంది. అలాగే రేపు థియేటర్స్ లో నాగార్జున స్టెప్స్ కి ఫాన్స్ రచ్చ రచ్చ చెయ్యడం ఖాయమని కూడా వీడియో చూసిన వాళ్ళు అంటున్నారు.
శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రం నాగార్జున సినీ కెరీర్లోనే అత్యంత భారీ వ్యయంతో తెరకెక్కుతుంది. నాగార్జున సరసన ఆషికా రంగనాథ్ హీరోయిన్ గా చేస్తుండగా ఆస్కార్ అవార్డు విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు.ఈ సామి రంగ సినిమాకి ప్రముఖ కొరియో గ్రాఫర్ విజయ్ బిన్నీ దర్శకుడు. సంక్రాంతికి రాబోతున్న ఈ సినిమా మీద నాగార్జున అభిమానులు చాలా భారీగానే ఆశలు పెట్టుకున్నారు.