English | Telugu
'మెకానిక్' సాంగ్ రిలీజ్ చేసిన 'ధమాకా' డైరెక్టర్!
Updated : Dec 13, 2023
మణి సాయి తేజ, రేఖ నిరోషా జంటగా నటిస్తున్న చిత్రం 'మెకానిక్'. ట్రబుల్ షూటర్ అనేది ట్యాగ్ లైన్. ముని సహేకర దర్శకత్వంలో టీనాశ్రీ క్రియేషన్స్ బ్యానర్ పై నాగ మునెయ్య(మున్నా) నిర్మిస్తున్న ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకొని త్వరలో విడుదలకి సిద్ధమౌతోంది. తాజాగా ఈ సినిమా నుంచి కైలాష్ ఖేర్ పాడిన పాటని సక్సెస్ ఫుల్ డైరెక్టర్ 'ధమాకా' ఫేమ్ నక్కిన త్రినాధ రావు లాంచ్ చేయడం జరిగింది.
'మెకానిక్' సినిమాలో ఇప్పటికే సిద్ శ్రీరామ్ పాడిన "నచ్చేసావే పిల్లా నచ్చేసావే " పాట ఇన్స్టా గ్రామ్ లో 100M+ వ్యూస్ సాధించగా, యూట్యూబ్ లో 8.5M+ వ్యూస్ సాదించి ట్రెండింగ్ లో ఉంది.
తనికెళ్ల భరణి, నాగ మహేష్, సూర్య, సమ్మెట గాంధీ, కిరీటి, ల్యాబ్ శరత్, మాస్టర్ చక్రి, వీర శంకర్, జబర్దస్త్ దొరబాబు, సునీత మనోహర్, సంధ్య జనక్ తధితరులు నటించిన ఈ చిత్రానికి పుష్పా ఫైట్ మాస్టర్ డ్రాగన్ ప్రకాష్ మాస్టర్ స్టంట్స్ అందించారు. ఈ సినిమా త్వరలో విడుదల చేయబోతున్నట్టు దర్శక నిర్మాతలు వెల్లడించి పాటని రిలీజ్ చేసిన నక్కిన త్రినాధ రావుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.