English | Telugu

2023 రివ్యూ: ఈ ఏడాది బాలయ్యదే హవా!

ఈ ఏడాది పలువురు హీరోలు రెండేసి సినిమాలతో ప్రేక్షకులను పలకరించారు. అయితే రెండు సినిమాలతోనూ ఘన విజయం సొంతం చేసుకున్న హీరో మాత్రం నటసింహం నందమూరి బాలకృష్ణ అని చెప్పవచ్చు. ఈ సంవత్సరం బాలయ్య 'వీరసింహారెడ్డి', 'భగవంత్ కేసరి' అనే సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాగా, రెండూ కూడా భారీ వసూళ్లు రాబట్టి ఆయన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచాయి.

బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన చిత్రం 'వీరసింహారెడ్డి'. బాలయ్య డ్యూయల్ రోల్ పోషించిన ఈ యాక్షన్ డ్రామా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలై మాస్ ప్రేక్షకులను అలరించింది. ముఖ్యంగా వీరసింహారెడ్డిగా బాలయ్య స్క్రీన్ ప్రజెన్స్ కి, డైలాగ్ డెలివరీకి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. వరల్డ్ వైడ్ గా రూ.130 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.

సంక్రాంతికి ఓ విజయాన్ని ఖాతాలో వేసుకున్న నటసింహం.. దసరాకు మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. బాలకృష్ణ టైటిల్ రోల్ లో అనిల్ రావిపూడి డైరెక్షన్ లో షైన్ స్క్రీన్స్ నిర్మించిన సినిమా 'భగవంత్ కేసరి'. బాలయ్యతో పాటు శ్రీలీల, కాజల్ అగర్వాల్‌, అర్జున్‌ రాంపాల్‌ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదలై అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించింది. ఆడ పిల్లను ఆడ పులిలా పెంచాలి అనే అద్భుతమైన సందేశంతో రూపొందిన ఈ సినిమా కుటుంబ ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ సినిమా కూడా వరల్డ్ వైడ్ గా దాదాపు రూ.130 కోట్ల గ్రాస్ వసూలు చేసి బాలకృష్ణకు మరో ఘన విజయాన్ని అందించింది.

రాజాసాబ్ సర్కస్ 1935 .. సీక్వెల్ కథ ఇదేనా! 

పాన్ ఇండియా ప్రభాస్(Prabhas)అభిమానులు,ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెబల్ మూవీ 'ది రాజాసాబ్'(The Raja saab)నిన్న బెనిఫిట్ షోస్ తో థియేటర్స్ లో ల్యాండ్ అయ్యింది. దీంతో థియేటర్స్ అన్ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడుతున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత సిల్వర్ స్క్రీన్ పై వింటేజ్ ప్రభాస్ కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందానికి అయితే అవధులు లేవు. రిజల్ట్ విషయంలో మాత్రం మిక్స్డ్ టాక్ వినపడుతుంది. రివ్యూస్ కూడా అదే స్థాయిలో  వస్తున్నాయి. కాకపోతే తెలుగు సినిమా ఆనవాయితీ ప్రకారం ఈ రోజు సెకండ్ షో కంప్లీట్ అయిన తర్వాత గాని అసలైన టాక్ బయటకి రాదు.