English | Telugu

God of War: ఎన్టీఆర్ వర్సెస్ అల్లు అర్జున్.. ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెడుతున్న త్రివిక్రమ్?

త్రివిక్రమ్ ఎందుకిలా చేస్తున్నాడు?
'గాడ్ ఆఫ్ వార్' ప్రాజెక్ట్ లో హీరో ఎవరు?
బన్నీ నుంచి ఎన్టీఆర్ చేతికి.. ఎన్టీఆర్ నుంచి మళ్ళీ బన్నీ చేతికి...
అసలు తెరవెనుక ఏం జరుగుతోంది?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్(Trivikram) ప్రస్తుతం వెంకటేష్ తో 'ఆదర్శ కుటుంబం హౌస్ నెం: 47' అనే సినిమా చేస్తున్నారు. 2026 వేసవిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. నిజానికి ఈ సినిమా కన్నా ముందు.. త్రివిక్రమ్ మరో భారీ ప్రాజెక్ట్ చేయాల్సి ఉంది. అది ఆలస్యమవ్వడంతో ఈ ఆదర్శ కుటుంబాన్ని పట్టాలెక్కించారు.

త్రివిక్రమ్, అల్లు అర్జున్(Allu Arjun) కలయికలో నాలుగో సినిమాగా 2023లో ఓ భారీ ప్రాజెక్ట్ ప్రకటన వచ్చింది. యుద్ధ దేవుడు(God of War) కార్తికేయ స్వామి కథ ఆధారంగా తెరకెక్కనున్న మైథలాజికల్ ఫిల్మ్ కావడంతో.. దీనిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

నిజానికి 'పుష్ప-2' తర్వాత అల్లు అర్జున్ ఈ సినిమానే చేస్తాడని అందరూ భావించారు. కానీ, ఆయన మాత్రం అట్లీ డైరెక్షన్ లో సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ తో బిజీ అయిపోయారు. బన్నీ కోసం కొంతకాలం వేచి చూసిన త్రివిక్రమ్.. ఆ తర్వాత ఇదే ప్రాజెక్ట్ ని జూనియర్ ఎన్టీఆర్(Jr NTR)తో ప్లాన్ చేశారు. ఈ విషయాన్ని నిర్మాత నాగవంశీ కూడా అనధికారికంగా ప్రకటించారు.

Also Read: దివ్య దృష్టి మూవీ రివ్యూ

ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ అనే భారీ యాక్షన్ ఫిల్మ్ చేస్తున్నారు. ఈ గ్యాప్ లో త్రివిక్రమ్ కూడా వెంకటేష్ సినిమాని మొదలుపెట్టారు. ఈ రెండు సినిమాలు పూర్తయ్యాక.. ఎన్టీఆర్-త్రివిక్రమ్ కలిసి 'గాడ్ ఆఫ్ వార్'తో బిజీ అవుతారనే అభిప్రాయాలు ఉన్నాయి. ఫ్యాన్స్ కూడా ఈ ప్రాజెక్ట్ కోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో మరో ఊహించని న్యూస్ తెరపైకి వచ్చింది.

'గాడ్ ఆఫ్ వార్' ప్రాజెక్ట్ ఎన్టీఆర్ నుంచి మళ్ళీ అల్లు అర్జున్ చేతికి వెళ్ళిందని, త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుందని.. బాలీవుడ్ మీడియాలో న్యూస్ చక్కర్లు కొడుడుతోంది. దీంతో ఈ ప్రాజెక్ట్ విషయంలో మళ్ళీ కన్ఫ్యూజన్ నెలకొంది. హీరోగా బన్నీ నటిస్తాడా? ఎన్టీఆర్ నటిస్తాడా? అనేది పెద్ద ప్రశ్నలా మిగిలింది. ఇన్ని రోజులుగా ప్రాజెక్ట్ జనాల్లో నానుతూ, అటూఇటూ చేతులు మారుతుండటంతో.. ఇందులో ఎవరు హీరోగా నటించినా మరో హీరో అభిమానులు హర్ట్ అయ్యే అవకాశముంది. మరి ఈ ప్రాజెక్ట్ చివరికి ఎవరి చేతికి వెళ్తుందో చూడాలి.