English | Telugu

ఎమ్మెస్ నారాయ‌ణ మృతి అంటూ పుకార్లు

ప్ర‌ముఖ హాస్య‌న‌టుడు ఎమ్మెస్ నారాయ‌ణ ఆరోగ్యం క్షీణించింది. ప్ర‌స్తుతం ఆయ‌న కిమ్స్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఎమ్మెస్ నారాయ‌ణ చ‌నిపోయారంటూ కొన్ని ప్ర‌ధాన ఛాన‌ళ్లు స్కోలింగ్‌ని వేశాయి. దాంతో చిత్రసీమ‌లో క‌ల‌క‌లం మొద‌లైంది. అయితే ఎమ్మెస్ చ‌నిపోలేద‌ని, అయితే ఆయ‌న ప‌రిస్థితి క్రిటిక‌ల్‌గా ఉంద‌ని ఆసుప‌త్రి వ‌ర్గాలు ధృవీక‌రించాయి. దాంతో టీవీ ఛాన‌ళ్లు నాలుక క‌రుచుకొని.. స్కోలింగ్‌ని ఆపేశాయి. ఈ విష‌యంలో ఎమ్మెస్ కుమారుడు విక్ర‌మ్ కూడా ఈ వార్త‌ల‌పై మండిప‌డ్డారు. ``నాన్న బాగానే ఉన్నారు. ఆయ‌న‌కు ఏం కాలేదు.. ద‌య‌చేసి పుకార్లు ఆపండి`` అని అభ్య‌ర్థించారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.