English | Telugu

టెంప‌ర్ లో సీన్స్ లేపేస్తున్నారా?

దండ‌యాత్ర‌.. ఇది ద‌యాగాడి దండ‌యాత్ర - అంటూ టీజ‌ర్లో ఎన్టీఆర్ విశ్వ‌రూపం చూపించిన ద‌గ్గ‌ర్నుంచి టెంప‌ర్‌ని ఎప్పుడెప్పుడు చూద్దామా...? అని అభిమానులు గంపెడాశ‌ల‌తో ఎదురుచూస్తున్నారు. ఆంధ్రావాలా రిజ‌ల్ట్‌ని దృష్టిలో పెట్టుకొన్న పూరి జ‌గ‌న్నాథ్ చాలా జాగ్ర‌త్త‌లు తీసుకొని మ‌రీ ఈ సినిమాని మ‌లిచాడు. అంతేకాదు.. ఎన్టీఆర్‌కి ఓ హిట్టు కంప‌ల్స‌రీ. అందుకే తానూ ఈ సినిమాపై చాలా ఆశ‌లు పెట్టుకొన్నాడు. ఎట్టిప‌రిస్థితుల్లోనూ ఈసారి తేడా రాకూడ‌ద‌ని ముందుస్తు జాగ్ర‌త్త‌లుఅన్నీ తీసుకొంటున్నాడు. అయితే ఓ విష‌యం మాత్రం ఎన్టీఆర్‌ని తెగ టెన్ష‌న్ పెడుతోంది. అదే ర‌న్ టైమ్‌. ఈ సినిమా నిడివి దాదాపుగా 2.45 నిమిషాలుగా తేలింది. ప్ర‌స్తుత‌మున్న ప‌రిస్థితిల్లో 2.15 సినిమానే సేఫ్‌. బోర్ కొట్ట‌కుండా ఎంత షార్ప్‌గా చెబితే అంత న‌చ్చుతుంది. నిజానికి పూరి సినిమాలు చాలా షార్ట్ అండ్ స్పీట్‌గా ఉంటాయి. అయితే ఈ సినిమా మాత్రం ర‌న్ టైమ్ 165 నిమిషాలొచ్చింది. ఎలాగైనా స‌రే.. 30 నిమిషాల సినిమా క‌ట్ చేయాల‌ని ఎన్టీఆర్ సూచిస్తున్నాడ‌ట‌. పూరి కూడా ఎక్క‌డెక్క‌డ ట్రిమ్ చేయొచ్చో ఓసారి చూసుకొంటున్నాడ‌ని టాక్‌. సెన్సార్ అయ్యాక ట్రిమ్ చేసుకొందాం అనుకొన్నా.. అప్ప‌టికి స‌మ‌యం ఉంటుందో లేదో అని ముందు జాగ్ర‌త్త‌గా ఈ సినిమాని ట్రిమ్ చేసే సెన్సార్‌కి పంపాల‌ని టెంప‌ర్ టీమ్ డిసైడ్ అయ్యింది. బాగున్నా, క‌థ‌కి అవ‌స‌రం లేద‌నుకొంటే.. సీన్స్ ని లేపేయండ‌ని.. ఎన్టీఆర్ కూడా మొహ‌మాటం లేకుండా చెప్పేశాడ‌ట‌. దాంతో ఈసినిమాపై ఎన్టీఆర్ ఎంత జాగ్ర‌త్త‌ప‌డుతున్నాడో అర్థ‌మ‌వుతోంది. ఈ ముంద‌స్తు జాగ్ర‌త్త‌ల‌న్నీ ఫ‌లించి.. టెంప‌ర్ హిట్ట‌యితే ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి పండ‌గే క‌దా..

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.