English | Telugu

సెప్టెంబర్‌లో సినిమాల యుద్ధం.. ప్రధాన పోటీ ఆ రెండు సినిమాల మధ్యే!

ఇటీవలి కాలంలో కూలీ, వార్‌2 చిత్రాలకు వచ్చినంత హైప్‌ మరో సినిమాకి రాలేదు. ఒకదాన్ని మించి ఒకటి అన్నట్టుగా ప్రమోషన్స్‌ ఇరగదీశాయి. కానీ, థియేటర్లలోకి వచ్చిన తర్వాత రెండు సినిమాలూ ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేకపోయాయి. ఆగస్ట్‌ నెలలో ఈ రెండు సినిమాలు తప్ప మరో పెద్ద సినిమా లేదు. నెలాఖరుకు రవితేజ మాస్‌ జాతర రావాల్సి ఉంది. అయితే ఈ సినిమా రిలీజ్‌ను వాయిదా వేశారు మేకర్స్‌. ఇక సెప్టెంబర్‌లో రిలీజ్‌ అవుతున్న సినిమాలపై భారీ అంచనాలే ఉన్నాయి.

సెప్టెంబర్‌ 4న అనుష్క, క్రిష్‌ల ‘ఘాటీ’ రిలీజ్‌ రాబోతోంది. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో రావాల్సింది. కానీ, కొన్ని కారణాల వల్ల రిలీజ్‌ వాయిదా పడుతూ వచ్చింది. ఈసారైనా పక్కాగా సినిమా రిలీజ్‌ అవుతుందా అనేది సందేహంగానే ఉంది. ఇక ‘మాస్‌ జాతర’ సెప్టెంబర్‌ 5న వచ్చే అవకాశం ఉంది. ఆరోజు కాకపోతే మరో వారం తర్వాత ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేస్తారు. తేజ సజ్జా ‘మిరాయ్‌’ కూడా సెప్టెంబర్‌ 5నే రిలీజ్‌ అవుతోంది. మరి ఘాటి, మిరాయ్‌.. ఈ రెండు సినిమాలు ఎలాంటి ఫలితాన్నిస్తాయో చూడాలి. సెప్టెంబర్‌ 12న బెల్లంకొండ శ్రీనివాస్‌ ‘కిష్కింధపురి’ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.

వచ్చే నెల 25న రెండు సినిమాల మధ్య పెద్ద వార్‌ జరగబోతోంది. పవన్‌కళ్యాణ్‌, సుజిత్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘ఓజి’, నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘అఖండ2’ చిత్రాలు ఒకేరోజు విడుదల కాబోతున్నాయి. ఆయా నిర్మాతలు ఈ సినిమాల రిలీజ్‌ డేట్స్‌ను ముందుగానే ఎనౌన్స్‌ చేసేశారు. ఓజి షూటింగ్‌ అల్రెడీ పూర్తయిపోయింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. అఖండ2 కూడా పోస్ట్‌ ప్రొడక్షన్‌ దశలోనే ఉంది. ఈ రెండు సినిమాల్లో అఖండ2 రిలీజ్‌ వాయిదా పడే అవకాశం ఉందనే ప్రచారం జోరుగా జరుగుతోంది.

ఇక డబ్బింగ్‌ సినిమాల విషయానికి వస్తే శివకార్తికేయన్‌ హీరోగా నటించిన మదరాసి సెప్టెంబర్‌ 5న రిలీజ్‌ అవుతోంది. విజయ్‌ ఆంటోని సినిమా భద్రకాళి సెప్టెంబర్‌ 12న విడుదలవుతోంది. మొత్తానికి వచ్చే నెల సినిమాల హడావిడి మాత్రం ఎక్కువగానే కనిపిస్తోంది. అయితే ఇందులో ఏ సినిమాకి ఎలాంటి ఫలితం వస్తుందనే విషయాన్ని మాత్రం ఎవరూ అంచనాల వేయలేకపోతున్నారు. ఎందుకంటే ఇటీవలికాలంలో హై ఎక్స్‌పెక్టేషన్స్‌తో వచ్చిన సినిమాలన్నీ పరాజయాన్ని చవిచూశాయి. అయితే ఎవరికి వారు తమ సినిమాపై ఎంతో కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు. మరి వచ్చే నెల ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో చూడాలి.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .