English | Telugu

రియల్ స్టంట్ హీరో సేఫ్

సినిమాల్లో రియల్ స్టంట్స్ చేసే మంచు హీరో మనోజ్ తాజాగా కారు ప్రమాదం నుండి బయటపడ్డాడు. జూబ్లీహిల్స్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్తున్న మనోజ్, ఔటర్‌రింగ్ రోడ్డు సమీపంలోని అప్పా జంక్షన్ వద్ద గేదెలు అడ్డురావడంతో కారు సడన్ బ్రేక్ వేశాడు. దాంతో కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. స్వల్పగాయాలు కావడంతో ఆయన్ని వెంటనే అపోలో హాస్పటల్‌కి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న మనోజ్ కుటుంబ సభ్యులు వెంటనే హాస్పిటల్ కి చేరుకొని, అతని ఆరోగ్య పరిస్తితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. తర్వాత మనోజ్ ను డిశ్చార్ చేయడంతో ఇంటికి తీసుకెళ్ళారు. మనోజ్ కు ఎలాంటి ప్రమాదం లేదని, త్వరలోనే కోలుకుంటాడని వైద్యులు చెప్పినట్లుగా మోహన్ బాబు తెలిపారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.