English | Telugu
బిగ్‌బాస్‌లో మరోసారి ‘ఆ’ ముద్దు ప్రస్తావన తెచ్చిన మన్నారా!
Updated : Oct 16, 2023
ఆమధ్య డైరెక్టర్ ఎ.ఎస్.రవికుమార్‌చౌదరి హీరోయిన్ మన్నారా చోప్రాను ముద్దు పెట్టుకున్న విషయం వైరల్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో విపరీతంగా సర్క్యులేట్ అయ్యాయి. అంతగా వైరల్ అయిన ‘ముద్దు’ విషయాన్ని మరోసారి బిగ్‌బాస్‌లో ప్రస్తావించింది మన్నారా చోప్రా. ‘ఒక పబ్లిక్ ఫంక్షన్‌లో మా డైరెక్టర్ నన్ను ముద్దు పెట్టుకోవడం అందరూ చెడుగా ఆలోచిస్తున్నారు. కానీ, రవికుమార్ నన్ను చాలా కాలం తర్వాత చూశాడు. ఒక ఎదిగిన పసిపాపను ముద్దు పెట్టుకున్నాడు తప్ప ఇందులో చెడు ఉద్దేశం ఏమీ లేదు. పిల్లలకు మనం ఇచ్చే పెక్ లాంటిది అది.
తాజాగా ఈ విషయాన్ని సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ 17లో ఇంటి సభ్యురాలిగా చేరింది మన్నారా. సల్మాన్‌ఖాన్‌తో సరదా చాట్ సెషన్‌లో పాల్గొంది. ఈ సందర్భంలో ముద్దు వ్యవహారాన్ని ప్రస్తావించింది. ఇక బిగ్‌బాస్ విషయానికి వస్తే హౌస్ నియమాలను వివరించే టాస్క్ మన్నారా చోప్రాకి ఇచ్చినట్లు కనిపిస్తోంది. ఆమె తన కోసం ఇంటి లోపల విలాసవంతమైన చోటును ఎంచుకుంది. మన్నారాకి సినీ కెరీర్ అంత ఆశాజనకంగా లేదు. ఇప్పుడు బిగ్‌బాస్ షోలో ఎంటర్ అయ్యింది కాబట్టి దీని తర్వాత తన కెరీర్ గ్రాఫ్ పెరిగే అవకాశం ఉంటుందని ఆమె ఆశిస్తోంది. మరి ఈ షో ఆమెకు ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి.