English | Telugu

"మంగళ"లో నటించటానికి భయపడ్డ ఛార్మి

సి యన్ ఆర్ క్రియేషన్స్ మరియూ మంత్ర ఎంటర్ టైన్ మెంట్స్ పతాకాలపై, ఛార్మి టైటిల్ పాత్రలో నటిస్తూండగా,ఓషో తులసీ రామ్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న విభిన్న కథా చిత్రం"మంగళ".ఈ చిత్రం లో నటించటానికి ఛార్మి తాను చాలా భయపడ్డాననీ, ఈ "మంగళ"సినిమాలో నటిస్తున్నప్పుడు చాలా నిద్రలేని రాత్రులను గడిపాననీ, ఈ "మంగళ"చిత్రాన్ని రానున్న శివరాత్రి పర్వదినం సందర్భంగా విడుదల చేస్తున్నారనీ, ఆ రోజు ఈ సినిమా చూస్తే శివరాత్రి జాగారం చేయటం చాలా తేలికనీ, ఎందుకంటే ఈ సినిమా చూస్తే నిద్ర పట్టదనీ మీడియాతో ఛార్మి అంది.తాను నటించిన "మంత్ర" చిత్రం థ్రిల్లర్ చిత్రమనీ, కానీ ఈ "మంగళ"చిత్రం మాత్రం హారర్ చిత్రమనీ కూడా ఛార్మి అంది.ఈ చిత్రంలోని "ఐస్ ఐస్" అనే పాట ఈ సంవత్సరానికే పాప్యులర్ సాంగ్ గా నిలుస్తుందని ఛార్మి జ్యోస్యం చెప్పారు. ఈ చిత్రాన్ని మార్చి 2 వ తేదీన విడుదల చేయనున్నారు.

ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్.. పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర బృందం

సంక్రాంతికి  వెల్ కమ్ చెప్తు నవీన్ పొలిశెట్టి, మీనాక్షి చౌదరి నిన్న 'అనగనగ ఒక రాజు'(Anaganaga Oka Raju)తో సిల్వర్ స్క్రీన్ పై తమ సత్తా చాటడానికి అడుగుపెట్టారు. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్  అధినేత నాగవంశీ నిర్మాత కావడం ఈ చిత్రం స్పెషాలిటీ. నూతన దర్శకుడు మారి(Maari)దర్శకత్వంలో పూర్తి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో తెరకెక్కగా, మార్నింగ్ షో నుంచే   పాజిటివ్ టాక్  తో దూసుకుపోతుంది.  దీంతో సంక్రాంతి పందెంలో ఈ చిత్రం సాధించే కలెక్షన్స్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా, చిత్ర బృందం మొదటి రోజు కలెక్షన్స్ ని అధికారకంగా ప్రకటించింది.