English | Telugu

మార్చిలో తొలి వారంలో "పులివేట"

తమిళంలో విజయ్ హీరోగా, అనుష్క హీరోయిన్ గా,బాబూ శివన్ దర్శకత్వంలో నిర్మించబడిన "వేట్టై కారన్" అనే సినిమాని తెలుగులో "పులివేట" పేరుతో విడుదల చేయటానికి కళాదర్శకుడు యమ్ వి గోపాలరావు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం తమిళంలో విడుదలై 70 కోట్ల భారీ మొత్తాన్ని వసూలు చేసింది.విజయ్ ఆంథోనీ ఈ "పులివేట" చిత్రానికి చక్కని సంగీతాన్నందించారు.ఈ "పులివేట" చిత్రంలో ప్రముఖ నటుడు రియల్ స్టార్ శ్రీహరి నిజాయితీ కలిగిన పోలీసాఫీసర్ గా, షాయాజీ షిండే, గౌస్ తదితరులు నటించారు.ఇటీవల విడుదలైన ఈ "పులివేట"చిత్రం తెలుగు వెర్షన్ ఆడియోకి ప్రేక్షకుల నుండి చక్కని స్పందన లభిందని ఈ చిత్ర నిర్మాత గోపాలరావు మీడియాకు తెలిపారు.ఈ "పులివేట" చిత్రానికి తెలుగులో శశాంక్ వెన్నెలకంటి మాటలు వ్రాస్తున్నారు.ఈ చిత్రానికి భువనచంద్ర, వెన్నెలకంటి, వనమాలి పాటలు వ్రాస్తుండగా,వి టి విజయన్ ఎడిటింగ్‍ నిర్వహించారు.ఈ చిత్రాన్ని మార్చి తోలి వారంలో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.