English | Telugu
'మందాకిని' వెబ్ సిరీస్ రివ్యూ
Updated : Mar 10, 2023
వెబ్ సిరీస్: మందాకిని
తారాగణం: ఆర్.కె. చందన్, హిమ బిందు, ప్రియ హెగ్డే, మిథున్, చాందిని, వర్ష, జయలలిత, సాయికిరణ్, ఆనంద్, నాగిరెడ్డి, జగన్ మోహన్, శశిధర్, శిరీష, మల్లాది రాఘవ తదితరులు
సినిమాటోగ్రఫీ: ప్రకాశ్ కోట్ల
ఎడిటర్: సుబ్బు పొలిశెట్టి
సంగీతం: మీనాక్షి భుజరంగ్
మాటలు: ఆసం శ్రీనివాస్
స్టోరీ, స్క్రీన్ ప్లే: శ్రీనివాస్ మండల
నిర్మాత : వరుణ్ చౌదరి గోగినేని
డైరెక్టర్: RK మలినేని
బ్యానర్: వరుణ్ ఎంటర్‌టైన్మెంట్స్
ఓటీటీ వేదిక: ఆహా
అంతరించిపోతున్న దేవాలయాలు వాటి వెనుక దాగి ఉన్న రహస్యాల గురించి తెలుసుకోవాలనుకునే అమ్మాయి, కలలో తనకు కనిపించే అమ్మాయి కోసం వెతికే అబ్బాయి.. శాపం పొందిన ఊరు.. ఈ ఊరికి ఆ అమ్మాయి, అబ్బాయికి సంబంధం ఏంటి? తెలియాలంటే.. ఓటీటీ వేదిక ఆహాలో సరికొత్త కథతో విడుదలైన ఈ 'మందాకిని' సిరీస్ చూడాల్సిందే.
కథ:
పూర్వం చండీపురం అనే గ్రామంలో తీవ్రమైన కరువొస్తుంది. ఆ ఊరి జనాలంతా తినడానికి తిండిలేక ఆకలి చావులు చస్తూ ఉంటారు. దీంతో ఆ ఊరి రాజు ఒక మహర్షిని కలిసి పరిష్కార మార్గం అడుగగా.. శక్తిపీఠాలలో ఒకటైన చండీ మాత ఆలయాన్ని నిర్మించి, మీ వంశస్థులు ప్రతీ ఏటా పూజ చేయమని చెప్తాడు. అది అలాగే కొనసాగుతుండగా.. కొన్ని సంవత్సరాలకి అర్థరాత్రి భవానీ అనే నాట్యకళాకారిణిని వెంబడిస్తూ అదే వంశానికి చెందిన జమీందార్ చండీ మాత గుడిలోకి ప్రవేశిస్తాడు. అక్కడ భవాని అనే అమ్మాయిని బలవంతం చేయగా.. ఆమె తనకి తానుగా చండీ మాత ముందు అగ్నికి ఆహుతి చేసుకుంటుంది. దీంతో ఆగ్రహించిన చండీమాత ఆ రాజుని త్రిశూలంతో అంతమొందిస్తుంది. అప్పటి నుండి ఆ ఊరి రాజ వంశస్థులకు శాపం చుట్టుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేదే మిగతా కథ.
విశ్లేషణ:
శుభలేఖ సుధాకర్ కథని చెప్తున్నట్టుగా మొదలవుతుంది. అంతరించిపోతున్న కొన్ని రహస్యాలను వెలికితీసేందుకు దైవం ఎంచుకున్న వారిలా హీరో రిషి(ఆర్.కె. చందన్), హీరోయిన్ మందాకిని(చాందిని) పరిచయమవుతారు. మొదటి ఎపిసోడ్‌లో క్యారెక్టర్ లని పరిచయం చేయడంలో పెద్దగా లాగ్ అవ్వకుండా డైరెక్టర్ జాగ్రత్త పడ్డాడు. కానీ రెండు మూడు ఎపిసోడ్స్ లో కొన్ని సీన్లను ట్రిమ్ చేస్తే బాగుండేది.
ఫ్లాష్ బ్యాక్ సీన్లను మలిచిన తీరు బాగుంది. ఒక బలమైన థీమ్ ని తీసుకున్న డైరెక్టర్.. పాత జనరేషన్ నుండి ఇప్పటి జనరేషన్ కి జరిగిన మార్పులను అధ్యయనం చేసి వాటిని ఈ కథకి తగ్గట్టుగా మలిచిన తీరు ఆకట్టుకుంది. చండీపురం అనే ఊరి రాజ వంశీయుల వల్ల శాపం పొందిన ఆ ఊరిని.. అందులో ఉండే ప్రజల కష్టాలను కన్నీళ్ళలను తుడిచేది ఎవరనే ఆసక్తిని కలిగించారు మేకర్స్.
ప్రకాష్ కోట్ల సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. మీనాక్షి భజరంగ్ అందించిన బిజిఎమ్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. నిర్మాణవిలువలు బాగున్నాయి. ఇప్పటిదాకా ఈ సిరీస్ నుంచి నాలుగు ఎపిసోడ్ లు వచ్చాయి. కథాకథనాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. చివరి ఎపిసోడ్ ని తదుపరి ఎపిసోడ్స్ లో ఏం జరగుతుందా అనే క్యూరియాసిటీతో ఎండ్ చేసారు మేకర్స్.
నటీనటుల పనితీరు:
శుభలేక సుధాకర్ మాటలు ఈ కథకి ప్రాణం పోశాయనే చెప్పాలి. జయలలిత చివరి ఎపిసోడ్‌లో కనిపించి కథపై ఆసక్తిని కలిగించింది. సాయికిరణ్ తన సెకండ్ ఇన్నింగ్స్ లో సరికొత్తగా కనిపించాడు. మందాకినిగా చాందినీ గుప్త రహస్యాలు వాటి యొక్క విశిష్టతను తెలుసుకోవాలనే ఒక రీసెర్చ్ స్టుడెంట్ గా ఆకట్టుకుంది. సీరియల్ నటిగా గుర్తింపు పొందిన వర్ష.. మందాకినికి అమ్మగా ఒదిగిపోయింది. రిషిగా ఆర్.కె చందన్ ఆకట్టుకున్నాడు. మిగతా వారు ఉన్నంతలో పర్వాలేదనిపించారు.
తెలుగువన్ పర్ స్పెక్టివ్:
కొత్త సస్పెన్స్ థ్రిల్లర్ ని ఓటీటీలో చూడాలనుకునేవారికి ఆహాలోని 'మందాకిని' ఒక మంచి థ్రిల్ ని ఇస్తుంది.
రేటింగ్: 3/5
-దాసరి మల్లేశ్