English | Telugu

ఇజ్రాయెల్‌ లో బాలీవుడ్ హీరోయిన్ మిస్సింగ్!

ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ నుష్రత్ భరుచ్చా మిస్ అయినట్లు తెలుస్తోంది. ఇటీవల హైఫా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరయ్యేందుకు ఇజ్రాయెల్ వెళ్లిన ఆమె, అక్కడే చిక్కుకుపోయింది. ప్రస్తుతం ఇజ్రాయెల్- పాలస్తీనా మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. ఈ దాడుల్లో ఇప్పటికే ఎందరో ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో అక్కడ బాలీవుడ్ నటి మిస్ కావడం సంచలనంగా మారింది. ఆమె చివరిసారిగా నిన్న మధ్యాహ్నం తన బృందంలోని ఒకరితో మాట్లాడుతూ.. ఓ బేస్‌మెంట్‌లో దాక్కున్నట్లు తెలిపింది. అయితే అక్కడ యుద్ధం కొనసాగుతుండడంతో ఆమెతో బృందానికి కమ్యునికేషన్‌ సంబంధాలు తెగిపోయినట్లు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం ఆమెను ఎక్కడో ఉందో తెలియడంలేదు.

2006 లో వచ్చిన జై సంతోషి మా సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నుష్రత్ భరుచ్చా 25కి పైగా సినిమాల్లో నటించింది. ఆమె తెలుగు, తమిళ సినిమాల్లో కూడా మెరిసింది. తెలుగులో శివాజీ సరసన 'తాజ్‌ మహాల్‌'(2010) అనే చిత్రంలో నటించిన ఆమె, తమిళంలో 'వాలిబా రాజా' అనే చిత్రంలో నటించింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.