English | Telugu

బాలీవుడ్ కి వెళ్ళనున్న లక్ష్మీ ప్రసన్న

బాలీవుడ్ కి వెళ్ళనున్న లక్ష్మీ ప్రసన్న అని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే డైలాగ్ కింగ్ గా, కలెక్షన్ కింగ్ గా, పేరుగడించిన పద్మశ్రీ, డాక్టర్ మంచు మోహన్ బాబు పెద్దకుమార్తె మంచు లక్ష్మీ ప్రసన్న చక్కని ప్రతిభకల నిర్మాత, అనుసంధాన కర్త (యాంకర్), నటి అన్న విషయం ప్రేక్షకులందరికీ తెలిసిందే. ఆ విషయం గతంలో ఆమె చేసిన "లక్ష్మీ టాక్ షో" చూసినా, లేక ప్రస్తుతం లక్ష్మీ ప్రసన్న అత్యంత ప్రతిభావంతంగా, అనితరసాధ్యంగా నిర్వహిస్తున్న"ప్రేమతో మీ లక్ష్మీ" కార్యక్రమాన్ని చూసినా అర్థమవుతుంది. ఇక నిర్మాతగా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో, మనోజ్ హీరోగా, లక్ష్మీ ప్రసన్ననిర్మించిన "ఝుమ్మంది నాదం" సినిమా చూస్తే ఆమె అభిరుచి ఏమిటన్నది అర్థమవుతుంది.

ప్రస్తుతం తన తమ్ముడు మనోజ్ కుమార్ హీరోగా, శేఖర్ రాజాని దర్శకుడిగా పరిచయం చేస్తూ లక్ష్మీ ప్రసన్న "ఊ..కొడతారా...ఉలిక్కి పడతారా"అనే విభిన్నకథా చిత్రాన్ని నిర్మించబోతున్నారు. "అనగనగా ఓ ధీరుడు", "దొంగల ముఠా" చిత్రాల్లో తాను ఎంతటి ప్రతిభ కలిగిన నటో నిరూపించారు. అలాంటి లక్ష్మీ ప్రసన్న ప్రస్తుతం బాలీవుడ్ సినిమాకి సైన్ చేసినట్లు తెలిసింది. అక్కడ కూడా లక్ష్మీ ప్రసన్న తన ప్రతిభ నిరూపించుకుని జాతీయ స్థాయిలో మన తెలుగు జండా ఎగురవేయాలని ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతోంది తెలుగువన్.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .

చీరకి, స్కర్ట్స్ కి తేడా ఇదే.. రోహిణి ఎవర్ని టార్గెట్ చేసిందో తెలుసా!

సుదీర్ఘ సినీ చరిత్ర కలిగిన నటి రోహిణి. అచ్చ తెలుగింటి ఆడపడుచు అయిన రోహిణి 1974 లో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి దక్షిణ భారతీయ సినీ పరిశ్రమకి చెందిన    ఎంతో మంది లెజండ్రీ యాక్టర్స్ తో స్క్రీన్ ని షేర్ చేసుకుంది. హీరోయిన్ గా,క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, స్క్రీన్ రైటర్ గా, డబ్బింగ్ కళాకారిణిగా చాలా బలమైన ఐడెంటిటీ ఆమె సొంతం. నన్ను కన్నది తెలుగు తల్లి అయితే, పెంచింది తమిళ తల్లి అని ఎలాంటి దాపరికాలు లేకుండా చెప్పే రోహిణి రీసెంట్ గా ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఆడవాళ్ళ గురించి మాట్లాడిన మాటలు వైరల్ గా నిలిచాయి.