English | Telugu

కింగ్ నాగార్జున కంట్లో కన్నీరు


కింగ్ నాగార్జన కంటతడి పెట్టాడు. సినిమాలో యాక్టింగ్ లో భాగంగా ఆయన అలా చేయలేదు. సినీ ప్రముఖులు చాలా మంది ఉన్నచోట ఆయన ఒక్కసారిగా ఇలా ఎమోష్నల్ అయ్యారు. ఇలా నాగార్జున కంటతడి పెట్టడం ముందెప్పుడు చూడలేదని సినీవర్గాలు అంటున్నాయి.
ఎందుకు ఏమిటీ అంటే, ప్రపంచ వ్యాప్తంగా అక్కినేని ఇంటి మూడు తరాలు కలిసి నటించిన మనం చిత్రం మే 23న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రం స్పెషల్ షో అన్నపూర్ణ స్టూడియోలో మనం మూవీ మేకర్స్ ఏర్పాటు చేశారు. ఈ మూవీ క్లైమాక్స్ సీన్స్ చూస్తున్నప్పుడూ నాగార్జన నిజంగానే ఏడ్చేశాడట. థియేటర్ లో అందరి ముందే ఆయన కంటతడి పెట్టుకున్నారట. ఈ సినిమా చూసి ప్రతి ప్రేక్షకులందరికీ ఇలాంటి ఫిలింగే కలుగుతుందంటున్నారు.
నాగేశ్వరరావు చివరిసారిగా కనిపించిన మనం చిత్రం విడుదల గురించి అక్కినేని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు తప్పకుండా ఆడియెన్స్ మనసులో ముద్ర వేసుకుపోతాయని అంటున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రెయిలర్స్ ఒక డిఫరెంట్ అండ్ ఫీల్ గుడ్ ఇంప్రెషన్ ఇవ్వడంలో సక్సెస్ అయ్యాయి, విడుదల తర్వాత ఈ సినిమా ఆడియెన్స్ ని మనసు చూరగొంటుందనే ఆశిస్తున్నారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.