English | Telugu
మెగాస్టార్ కి నో ఎంట్రీ అంటున్న అరబ్ కంట్రీస్
Updated : Nov 21, 2023
మన తెలుగు సినిమారంగానికి చిరంజీవి మెగాస్టార్ అయితే మలయాళ సినిమా రంగానికి మమ్ముట్టి మెగాస్టార్. దాదాపు రెండున్నర దశాబ్దాలపై నుంచి మమ్ముట్టి మలయాళ సినీ రంగంలో తిరుగులేని కధానాయకుడిగా కొనసాగుతు వస్తున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచే మమ్ముట్టి సినిమా సౌత్ తో పాటు ఇతర దేశాల్లో కూడా విడుదల అవుతు వస్తుంది.అలాంటిది ఇప్పడు మమ్ముట్టి సినిమాని కొన్ని దేశాల్లో బ్యాన్ చెయ్యడం సంచలనం సృష్టిస్తుంది.
మెగాస్టార్ మమ్ముట్టి నటించిన తాజా చిత్రం కాదల్ ది కోర్. అడల్ట్ కంటెంట్ తో రూపొందిన ఈ చిత్రం ఎల్లుండి అంటే 23న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అవ్వబోతుంది. కానీ కువైట్, ఖతర్ లాంటి అరబ్ కంట్రీస్ లో మాత్రం విడుదల అవ్వడం లేదు. మూవీలో ఉన్న అడల్ట్ కంటెంట్ మూలంగా ఆ దేశాల్లో కాదల్ ది కోర్ ని బ్యాన్ చేసారు. మెగాస్టార్ మమ్ముట్టి సినిమాకి అరబ్ కంట్రీస్ నో ఎంట్రీ అనడం చిత్ర యూనిట్ తో పాటు మమ్ముట్టి అభిమానులని కలవరపరుస్తుంది.
కాదల్ ది కోర్ చిత్రంలో మమ్ముట్టి సరసన జ్యోతిక నటించగా జో బేబీ దర్శకత్వం వహించాడు.వేఫారెర్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం మీద మమ్ముట్టి అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోను మంచి అంచనాలే ఉన్నాయి. మమ్ముట్టి రీసెంట్ గా కన్నూర్ స్క్వాడ్ అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు.ఓటిటిలో డైరెక్ట్ గా వచ్చిన ఆ మూవీ ప్రేక్షకులందర్నీ విశేషంగా ఆకట్టుకుంది