English | Telugu

సర్ ప్రైజ్.. కళ్యాణ్ రామ్ 'డెవిల్'లో మాళవిక!

'ఎవడే సుబ్రహ్మణ్యం' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన మాళవిక నాయర్.. 'కళ్యాణ వైభోగమే', 'మహానటి' వంటి సినిమాల్లో నటించి తన సహజ నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె హీరోయిన్ గా నటించిన తాజా చిత్రం 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే ఆమె హీరోయిన్ గా నటిస్తున్న మరో చిత్రం 'అన్నీ మంచి శకునములే' మేలో విడుదల కానుంది. ఇదిలా ఉంటే మాళవిక ఓ క్రేజీ ప్రాజెక్ట్ లో నటిస్తోంది. ఆ వివరాలను స్వయంగా మాళవిక రివీల్ చేయడం విశేషం.

గతేడాది 'బింబిసార'తో బ్లాక్ బస్టర్ అందుకున్న నందమూరి కళ్యాణ్ రామ్.. ఈ ఏడాది 'అమిగోస్'తో నిరాశపరిచాడు. ప్రస్తుతం ఆయన చేతిలో 'డెవిల్' అనే క్రేజీ ప్రాజెక్ట్ ఉంది. నవీన్ మేడారం దర్శకత్వంలో 1945 నాటి బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ కథాంశంతో భారీ స్థాయిలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ నిర్మిస్తోంది. 'బింబిసార' తరహాలోనే ఈ చిత్రం కూడా సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటోంది. కళ్యాణ్ రామ్ పాత్రకి సంబంధించిన ఫస్ట్ లుక్ మినహా ఈ సినిమా నుంచి పెద్దగా ఎలాంటి అప్డేట్స్ లేవు. కనీసం హీరోయిన్ ఎవరనే విషయాన్ని కూడా ప్రకటించలేదు. అయితే మేకర్స్ ఇంకా అధికారికంగా ప్రకటించినప్పటికీ.. తాను ఈ సినిమాలో నటిస్తున్నట్లు తాజాగా మాళవిక చెప్పి సర్ ప్రైజ్ చేసింది. 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి' ప్రమోషన్స్ లో భాగంగా రీసెంట్ గా మీడియాతో ముచ్చటించిన ఆమె.. తన తదుపరి సినిమాల గురించి మాట్లాడుతూ 'అన్నీ మంచి శకునములే'తో పాటు కళ్యాణ్ రామ్ సరసన 'డెవిల్' సినిమాలో నటిస్తున్నానని తెలిపింది. ఇప్పటిదాకా క్యూట్ లవ్ స్టోరీలు, పక్కింటి అమ్మాయి తరహా పాత్రలు చేసి మెప్పించిన మాళవిక.. డెవిల్ లో ఎలాంటి పాత్రలో కనిపించనుందనేది ఆసక్తికరంగా మారింది.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.