English | Telugu

మ‌హేష్ బాబు.. ''రోగ్‌''..? ఏమిటీ టైటిల్‌...??

ఈ మ‌ధ్య టైటిళ్లు చూస్తుంటే ఎల‌ప‌రం వ‌చ్చేస్తోంది. ఏమిటా టైటిళ్లు హ‌వ్వా?? నోటికేదొస్తే అదే సినిమా పేరైపోవ‌డం ఏమిటో ఎంత బుర్ర బ‌ద్ద‌లు కొట్టుకొన్నా అర్థ‌మై చావ‌డం లేదు. టైటిళ్ల‌లోనూ కుసింత కాళాత్మ‌క ఉండాలి అనే పెద్ద పెద్ద కోరిక‌లు ఎవ్వ‌రికీ లేవు గానీ, కాస్త చెప్పుకోవ‌డానికి గౌర‌వ ప‌దంగానైనా ఉండాలి క‌దా..? తాజాగా మ‌రో టైటిల్ హ‌ల్ చ‌ల్ చేస్తోంది. అదే.. ''రోగ్‌''. అదీ ఎవ‌రికి అనుకొంటున్నారు..?? మ‌హేష్ బాబుకి.

పోకిరి, ఈడియ‌ట్‌, దేశ ముదురు.. ఇలా తిట్ల‌నే టైటిళ్లుగా మార్చి హిట్లు కొట్టిన ఘ‌న‌త వ‌హించాడు పూరి జ‌గ‌న్నాథ్‌. ఇప్పుడు మ‌హేష్ బాబు కోసం కూడా ఓ తిట్టుని వెదుకుతున్నాడు. మ‌హేష్ - పూరి క‌ల‌యిక‌లో ఓ చిత్రం రూపుదిద్దుకోబోతోంది. ఎన్టీఆర్ సినిమా పూర్త‌యిన వెంట‌నే మ‌హేష్ ప్రాజెక్టుపై దృష్టి పెట్ట‌నున్నాడు పూరి. ఇటీవ‌ల మ‌హేష్ కి లైన్ కూడా వినిపించాడ‌ట‌. ఆ సినిమాకి ''రోగ్‌'' అనే టైటిల్ పెట్టే ఆలోచ‌న‌లో ఉన్నాడు పూరి. రోగిస్టివాడిలా ఈ రోగ్ ఏమిటో ఎవ్వ‌రికీ అర్థం కావ‌డం లేదు. కాక‌పోతే ఇది వ‌ర్కింగ్ టైటిలే కాబ‌ట్టి ఫ‌ర్లేదు.. త‌ర‌వాత మారుస్తారులే అని స‌ర్దుకుపోవ‌చ్చు. అయితే పూరికి తిట్టు టైటిల్‌గా పెట్టి హిట్టు కొట్టిన ఘ‌న‌త‌. ఆసెంటిమెంట్ ప్ర‌కారం మ‌హేష్ బాబుని ఒప్పించి రోగ్ అనే టైటిల్ ఫిక్స‌యితే మాత్రం ప‌రిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. పోస్ట‌ర్‌పై మ‌హేష్ అందంగా క‌నిపిస్తుంటాడు. కింద రోగ్ అనే టైటిల్‌..?! ఏంటో ఈ రోగం..??
పూరీ కాస్త ఆలోచించుకో నాయినా..?!!

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.